సీతాకోక చిలుకకు ప్రాణం పోసిన మహిళ.. వీడియో వైరల్
Butter Fly | ఓ ఐడీయా జీవితాన్నే మార్చేస్తోంది. అలా ఓ మహిళకు వచ్చిన చిన్న ఐడియా.. ఓ సీతాకోక చిలుకకు ప్రాణం పోసేలా చేసింది. ఓ బటర్ ఫ్లైకి కుడి భాగంలోని రెక్క కొంచెం విరిగిపోయింది. దీంతో అది ఎగరలేని దశలో ఉండిపోయింది. ఆ

ఓ ఐడీయా జీవితాన్నే మార్చేస్తోంది. అలా ఓ మహిళకు వచ్చిన చిన్న ఐడియా.. ఓ సీతాకోక చిలుకకు ప్రాణం పోసేలా చేసింది. ఓ బటర్ ఫ్లైకి కుడి భాగంలోని రెక్క కొంచెం విరిగిపోయింది. దీంతో అది ఎగరలేని దశలో ఉండిపోయింది. ఆ సీతాకోక చిలుకను గమనించిన టిక్ టాక్ యూజర్ దహ్లియా దాన్ని చేరదీసింది. రెక్క విరిగిపోయి ఉండటంతో.. ఎగరడానికి ఆ పక్షికి శక్తి సరిపోవడం లేదు. ఎలాగైనా అది విహరిస్తే చూడాలనే సంకల్పం దహ్లియాకు ఏర్పడింది.
క్రాఫ్ట్ స్టోర్ కు వెళ్లిన దహ్లియా సీతాకోక చిలుక బొమ్మను తీసుకొని ఇంటికి వచ్చింది. పై భాగంలో ఉన్న రెక్క సైజును కొలిచి.. ఆ సైజులోనే తేలిక బరువులో ఉన్న ఈకను కట్ చేసింది. అనంతరం ఆ ఈకను విరిగిన రెక్క స్థానంలో సీతాకోక చిలుకకు అమర్చింది. ఇక తర్వాత ఆ పక్షి ఎగరడం ప్రారంభించింది. రోజురోజుకు దాంట్లో మరింత పరిణితి కనిపించింది. అలా గార్డెన్లో కూడా సీతాకోక చిలుక ఎగరడంతో దహ్లియా సంబుర పడింది.

ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న సీతాకోక చిలుకకు గుర్తుగా దహ్లియా తన చేతిపై దాని ప్రతిమను టాటూగా వేయించుకుంది. నెవర్ గివ్ అప్ అంటూ రాయించుకుంది దహ్లియా. సీతాకోక చిలుక పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి.. దానికి ప్రాణం పోసిన దహ్లియాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

