e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home News Heartbreaking Video : బేబీ డాల్ఫిన్ చ‌నిపోయింద‌ని తెలిసి.. త‌ల్లి డాల్ఫిన్ ఏం చేసిందో చూడండి

Heartbreaking Video : బేబీ డాల్ఫిన్ చ‌నిపోయింద‌ని తెలిసి.. త‌ల్లి డాల్ఫిన్ ఏం చేసిందో చూడండి

ఏ ప్రాణికైనా స‌రే.. త‌న బిడ్డ అంటే చ‌చ్చేంత ప్రేమ ఉంటుంది. మ‌నుషుల‌కే కాదు.. జంతువులుకు, ఇత‌ర జీవుల‌కూ ఫ్యామిలీ ఉంటుంది. వాటికీ పిల్ల‌లు ఉంటాయి. వాటికి ఏమైనా అయితే అవి త‌ట్టుకోలేవు. తాజాగా చైనాలోని సౌత్ చైనా స‌ముద్రంలో హృద‌య విదార‌క‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

సౌత్ చైనా స‌ముద్రంలో ఉండే చైనీస్ వైట్ డాల్ఫిన్ త‌న బేబీ డాల్ఫిన్ కోసం ప‌డిన క‌ష్టం చూస్తే అంద‌రికీ కంట‌త‌డి తెప్పిస్తుంది. త‌న బేబీ డాల్ఫిన్ చ‌నిపోవ‌డంతో.. ఏం చేయాలో తెలియ‌ని త‌ల్లి డాల్ఫిన్.. దాన్ని స‌ముద్రం లోప‌లికి వెళ్ల‌నీయ‌కుండా.. అడ్డుకొని.. పైకి లేపేందుకు తెగ ట్రై చేసింది.

- Advertisement -

దానితో పాటు మ‌రికొన్ని డాల్ఫిన్స్ కూడా అక్క‌డ చేరుకొని త‌న బేబీ స‌ముద్రంలో మునిగిపోకుండా కాపాడాయి. ఈ దృశ్యాన్ని చూసిన కొంద‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు అయితే.. ఆ త‌ల్లి డాల్ఫిన్ ప‌డే ఆరాటాన్ని చూసి చ‌లించిపోతున్నారు. త‌న బేబీ చ‌నిపోయింద‌న్న విష‌యాన్ని జీర్ణించుకోలేక‌.. త‌న క‌ళ్ల‌ముందే అది ఉండాల‌ని ఆ త‌ల్లి ప‌డిన త‌ప‌న‌ను చూసి కంట‌త‌డి పెడుతున్నారు.

అరుదైన జాతికి చెందిన డాల్ఫిన్లు అవి

ఆ డాల్ఫిన్లు చాలా అరుదైన జాతికి చెందిన‌వి. వాటినే చైనీస్ వైట్ డాల్ఫిన్స్ అని అంటారు. పింక్ డాల్ఫిన్స్ అని కొంద‌రు పిలుస్తారు. అయితే.. ఈ డాల్ఫిన్ల జాతి రోజురోజుకూ అంత‌రించిపోతోంది. వీటి గ్రోత్ రేట్ చాలా స్లోగా ఉంటుంది. రీప్రొడ‌క్ష‌న్ కూడా త‌క్కేవే. అందుకే.. ఈ జాతి డాల్ఫిన్ల‌ను అంత‌రించిపోతున్న జాబితాలో చేర్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

DairyMilk Cricket Ad : 30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అదే క్రికెట్ యాడ్.. చిన్న ట్విస్ట్‌తో.. నెటిజ‌న్లు ఫిదా

Frog Viral Photo : ఈ ఫోటోలో క‌ప్ప ఎక్క‌డుందో క‌నిపెడితే మీరు గ్రేట్‌

Maggi Milkshake : మ్యాగీ మిల్క్‌షేక్… స‌రికొత్త రెసిపీ.. ఇప్పుడిదే ట్రెండ్‌.. నెటిజ‌న్లు ఏమంటున్నారంటే?

సీతాకోక చిలుక‌కు ప్రాణం పోసిన మ‌హిళ‌.. వీడియో వైర‌ల్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement