డెయిరీ మిల్క్ చాకొలేట్ అంటే ఇష్టం ఉండనివాళ్లు ఉండరు. అవును.. డెయిరీ మిల్క్ చాకొలేట్ టేస్ట్ అటువంటిది. ముఖ్యంగా పిల్లలు అయితే… ఆ చాకొలేట్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లల బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో డెయిరీ మిల్క్ చాకొలేట్ ఉండాల్సిందే. ఈ చాకొలేట్ చాలా దశాబ్దాల నుంచి ఇండియాలో కూడా అందరి మన్ననలు పొందుతూ.. బెస్ట్ చాకొలేట్గా దూసుకుపోతోంది.
తాజాగా డెయిరీ మిల్క్ చాకొలేట్ కంపెనీ క్యాడ్బరీ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఓ యాడ్‌ను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ట్విస్ట్ ఏంటంటే.. అదే యాడ్‌ను 1990లోనూ రూపొందించారు. 1990లో వచ్చిన యాడ్ కాన్సెప్ట్నే ఇప్పుడు కూడా తీసుకొని యాడ్‌ను రీక్రియేట్ చేసినప్పటికీ.. తాజాగా యాడ్‌లో మహిళల అసాధారణ విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం కోసమే ఈ యాడ్‌ను రీక్రియేట్ చేసినట్టు క్యాడ్బరీ సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించింది.
1990లో వచ్చిన యాడ్‌లో క్రికెటర్‌గా పురుషుడిని పెట్టి.. స్టేడియంలో చాక్లెట్ తింటున్న వ్యక్తిగా ఓ మహిళను పెట్టారు. తాజా యాడ్‌లో క్రికెటర్‌గా మహిళను, చాక్లెట్ తింటున్న వ్యక్తిగా ఓ యువకుడిని పెట్టి అదే కాన్సెప్ట్‌తో వీడియోను రీక్రియేట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. అయితే.. సూపర్బ్.. అంటూ క్యాడ్బరీ కంపెనీని తెగ మెచ్చుకుంటున్నారు. మహిళల కోసం.. వాళ్ల కష్టాన్ని, దాని ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి.. వాళ్ల విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలన్న కాన్సెప్ట్‌తో వచ్చిన యాడ్ సూపర్బ్ అంటూ నెటిజన్లు తెగ ఖుషీ అవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Frog Viral Photo : ఈ ఫోటోలో కప్ప ఎక్కడుందో కనిపెడితే మీరు గ్రేట్
సీతాకోక చిలుకకు ప్రాణం పోసిన మహిళ.. వీడియో వైరల్