ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. తరుచూ ఆయన పలు సందేశాత్మక వీడియోలు, ఫన్నీ వీడియోలు, ఆలోచింపజేసే వీడియోలు, పోస్టులు పెడుతుంటారు. అవి వైరల్ కూడా అవుతుంటాయి. తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియోను షేర్ చేయడంతో పాటు.. ఒక మంచి బిజినెస్ టిప్‌ను కూడా తన అభిమానులతో పంచుకున్నారు ఆనంద్.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఒక పెట్ డాగ్.. ఓ డోర్ వెనుక నిల్చుంటుంది. ఆ డోర్‌కు గ్లాస్ ఫ్రేమ్ ఉంటుంది కానీ.. గ్లాస్ ఉండదు. తన యజమాని అక్కడే ఉండి తనను ఉడ్ ప్రేమ్ నుంచి బయటికి వెళ్లాలని చెప్పినా ఆ కుక్క అస్సలు వెళ్లదు. చివరకు తన యజమాని డోర్ తీస్తే కానీ అది బయటికి వెళ్లదు. ఈ వీడియోనే ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేసి.. మంచి క్యాప్షన్ పెట్టారు.
మన వ్యసనాన్ని ఎలా అలవాటుగా మార్చుకుంటామో చెప్పడానికి ఇంతకన్నా మంచి మార్గం ఉంటుందా? ఈరోజుల్లో ఒక బిజినెస్‌లో నేర్చుకోవాల్సిన అత్యంత విలువైన నైపుణ్యం.. ఎలా విముక్తి పొందాలో తెలుసుకోవడం అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌ను నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కొందరి జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంటుంది. కొందరు తమ జీవితాలను ఇలాగే గడిపేస్తుంటారు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
No better way of illustrating our addiction to habit…The most valuable skill in business today is knowing how to break free… https://t.co/HQ7cmgxtyp
— anand mahindra (@anandmahindra) October 12, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Wine Factory : బయటపడ్డ 1500 ఏళ్ల నాటి వైన్ ఫ్యాక్టరీ.. చూస్తే మతి పోవాల్సిందే
Viral Video : ఒక క్వార్టర్ అంటే ఎంత?.. స్టూడెంట్ సమాధానానికి బిత్తరపోయిన ప్రొఫెసర్
Pic of the Day : ఈ ఫోటోను చూసి షాక్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ ఈ ఫోటోలో ఏముంది?
Flood Dining : వెరైటీ రెస్టారెంట్.. దీని గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే
ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లు తోమేవారు.. ఇప్పుడు అదే బొగ్గుతో కాఫీ, ఐస్‌క్రీంలు తయారీ.. ఎందుకు?
Love Story | డేటింగ్ యాప్‌లో పరిచయమై.. పరిణయమాడిన వృద్ధ ప్రేమికులు
Guinness Record : రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్