Guinness Record : రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్
Guinness Record : గతంలో నమోదైన రికార్డులను మరోసారి నెటిజెన్లకు గుర్తుచేస్తూ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది ఇన్స్టాగ్రామ్. 2016 లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ...

(Guinness Record) గతంలో నమోదైన రికార్డులను మరోసారి నెటిజెన్లకు గుర్తుచేస్తూ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది ఇన్స్టాగ్రామ్. 2016 లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఆటో డ్రైవింగ్ వీడియోను మరోసారి షేర్ చేసింది.
చెన్నైకి చెందిన ఎం జగదీష్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఆటోను నడపడంలో ఆయనకు ఆయనే సాటి. ఐదేండ్ల క్రితం రెండు చక్రాలపైనే మూడు చక్రాల బండి (ఆటో) ని నడిపి కొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. అలా రెండు చక్రాలపై దాదాపు 2.2 కిలో మీటర్లు నడిపి రికార్డు తన పేరిట రాసుకున్నాడు. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో ఈ అద్భుతమైన స్టంట్ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ రికార్డు సాధిస్తానని అనుకోలేదని, అయితే సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నదని జగదీశ్ చెప్పారు.
‘ఎపిక్ ఆటో-రిక్షా సైడ్ వీలీ. భారతదేశంలోని చెన్నైకి చెందిన ఆటో రిక్షా డ్రైవర్ జగతీష్ ఎం ఈ సైడ్ వీలీలో కొత్త రికార్డును నమోదుచేశాడు’ అని వీడియోను షేర్ చేస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీపై వ్రాసింది. దీనిపై నెటిజెన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10 స్టంట్ డైరెక్టర్ దొరికాడోచ్ అని ఒకరు రాయగా.. ఓన్లీ ఇండియన్స్ కెన్ డూ దిస్.. అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఆర్ఎస్ఎస్ లేకపోతే దేశం రెండో పాకిస్తాన్ అయ్యేది: ప్రభు చౌహాన్
బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి మేనక, వరుణ్ ఔట్!
వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలి : వెంకయ్యనాయుడు
మలేరియా వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం
సంపాదనలో 10 వ వంతు దానం చేయమన్న గురు గోవింద్ సింగ్
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

