Guru Gobind Singh: సంపాదనలో 10 వ వంతు దానం చేయమన్న గురు గోవింద్ సింగ్
Guru Gobind Singh : సిక్కుల పదవ గురువు, చివరి గురువు కూడా అయిన గురు గోవింద్ సింగ్ 1708 లో సరిగ్గా ఇదే రోజున వీర మరణం పొందారు. ఖల్సా పంత్‌ను...

(Guru Gobind Singh) సిక్కుల పదవ గురువు, చివరి గురువు కూడా అయిన గురు గోవింద్ సింగ్ 1708 లో సరిగ్గా ఇదే రోజున వీర మరణం పొందారు. ఖల్సా పంత్‌ను స్థాపించి ‘5 కాకర్’ అందించిన మహాపురుషుడు ఆయన. ధైర్యవంతుడైన సాధువుగా పేరు తెచ్చుకున్నారు. యువతను సన్మార్గంలో నడిపేందుకు ఎన్నో ఉపదేశాలు చేశారు.
1666 డిసెంబర్ 22 న బిహార్‌లోని పాట్నా నగరంలో జన్మించిన గురు గోవింద్ సింగ్ వంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో అరుదుగా కనిపిస్తారు. మొఘలుల అణచివేతకు లొంగకుండా వారిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. 1699 లో ఖల్సా పంత్‌ను స్థాపించి యువతను పోగుచేశారు. వారిలో ధైర్యం ప్రోది చేస్తూ మొఘలులపైకి దండెత్తారు. చివరకు 1708 అక్టోబర్ 7న మొఘలులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు.
వాహె గురు జీ కా ఖల్సా, వహే గురు జీ కి ఫతే.. వంటి వాక్యాలు గురు గోవింద్ సింగ్ ధైర్యసాహసాలను గురించి చెప్తాయి. గురునానక్ 15 వ శతాబ్దంలో సిక్కు పంత్‌ను స్థాపించారు. గోవింద్ సింగ్ తండ్రి గురు తేజ్ బహదూర్ కూడా ఈ శాఖకు గురువుగా ఉన్నారు.
గురు గోవింద్ సింగ్ బోధనలు
ఆదాయంలో పదోవంతు దాతృత్వానికి విరాళంగా ఇవ్వండి.
ఎక్కువగా పని చేయండి. కష్టపడి పనిచేయండి.
సంపద, యువతను వదులుకోవద్దు. కులం, మతం గురించి యువత అహంకారంతో ఉండొద్దు.
గుర్బానీని జ్ఞాపకం పెట్టుకోవాలి. గుర్బానీని గుర్తుంచుకోండి.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2001 : ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం ప్రారంభించిన అమెరికా, బ్రిటన్
2000: మానవ క్లోనింగ్ శిక్షార్హమైన నేరంగా ప్రకటించిన జపాన్
1992: మత అల్లర్లను ఎదుర్కొనేందుకు భారతదేశంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్థాపన
1987: భారతదేశం నుంచి ఖలిస్తాన్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న సిక్కు జాతీయవాదులు
1952: పంజాబ్ రాజధానిగా చండీగఢ్ ఏర్పాటు
1950: కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ ఛారిటీని స్థాపించేందుకు వాటికన్ నుంచి అనుమతి పొందిన మదర్ థెరిసా
1942: ఐక్యరాజ్యసమితి స్థాపనను ప్రకటించిన అమెరికా, బ్రిటిష్ ప్రభుత్వం
1886: క్యూబాలో బానిసత్వాన్ని రద్దు చేసిన స్పెయిన్
1586: కశ్మీర్లోకి ప్రవేశించిన మొఘల్ సైన్యం
ఇవి కూడా చదవండి..
జెరూసలెంలో 2,700 ఏండ్ల క్రితం టాయిలెట్ లభ్యం
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
పరిస్థితి మెరుగుపడకపోతే.. నీటి సంక్షోభం తప్పదు : యూఎన్ హెచ్చరిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

