water crisis : పరిస్థితి మెరుగుపడకపోతే.. నీటి సంక్షోభం తప్పదు : యూఎన్ హెచ్చరిక
water crisis : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న నీటి సంక్షోభం గురించి ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలోని లక్షల మంది ప్రజలు తక్కువ నీటి లభ్యత కారణంగా ...

న్యూయార్క్ : (water crisis) ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న నీటి సంక్షోభం గురించి ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలోని లక్షల మంది ప్రజలు తక్కువ నీటి లభ్యత కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ నివేదికలో పేర్కొన్నది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ముప్పు పొంచి ఉన్నదని స్పష్టం చేసింది. ‘ది స్టేట్ ఆఫ్ క్లైమేట్ సర్వీసెస్ 2021: వాటర్’ పేరుతో ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదలైంది. ప్రస్తుతం నీటి నిర్వహణ, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరికల విధానం మధ్య సమన్వయం లోపించిందని నివేదికలో చెప్పింది. ఇదే సమయంలో ప్రపంచ స్థాయిలో వాతావరణ నిధుల ప్రయత్నాలు కూడా సరిపోవని కూడా స్పష్టం చేసింది.
ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం, 2018 లో 350 కోట్ల ప్రజలు సంవత్సరంలో 11 నెలలు మాత్రమే నీటిని పొందారు. అంటే, వారు నెల రోజుల పాటు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారని అర్థం. ఇదే సమయంలో 2050 నాటికి ఈ సంఖ్య 500 కోట్లకు చేరినా ఆశ్చర్యపోవద్దు. ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ సెక్రటరీ జనరల్ పెట్రీ టల్లాస్ ప్రకారం, నీటి లభ్యతలో మార్పు కారణంగా భూమి ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతున్నది. వర్షపాతం అంచనాలు, వ్యవసాయ సీజన్లపై వాతావరణ మార్పు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఆహార భద్రత, మానవ ఆరోగ్యం, అభివృద్ధికి చిక్కులను కలిగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలా చేయండి..
గత రెండు దశాబ్దాలలో భూగర్భంలోని నీటి పరిమాణం ఏటా 1 సెం.మీ చొప్పున తగ్గుతున్నది. దీని ప్రధాన ప్రభావం అంటార్కిటికా, గ్రీన్లాండ్లో కూడా కనిపించింది. ఇదే సమయంలో గత రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా కరువు కూడా పెరిగింది. ఫలితంగా అత్యధిక మరణాలు ఆఫ్రికాలో సంభవించాయి. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా ప్రపంచం మొత్తానికి ఒక సవాలుగా మారిందని విచారం వ్యక్తం చేసింది. నీటి నిర్వహణను సరిచేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. పెట్టుబడి స్థాయిని కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. కరవు, వరద సూచనలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. ఇలాంటివి అమలు చేసేందుకు పేద దేశాలలో పెట్టుబడులు పెట్టాలనే సలహాలను కూడా నివేదికలో పొందుపరిచారు.
ఇవి కూడా చదవండి..
తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
ఇండియన్ పీనల్ కోడ్ ఆమోదించి నేటికి 161 ఏండ్లు
మీరు 30 దాటిన మహిళలా? అయితే, ఈ 6 పరీక్షలు తప్పనిసరి..!
13 మంది హజారాలను చంపిన తాలిబాన్ : హక్కుల సంఘం ఆరోపణ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

