e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home News Tests for women : మీరు 30 దాటిన మహిళలా? అయితే, ఈ 6 పరీక్షలు తప్పనిసరి..!

Tests for women : మీరు 30 దాటిన మహిళలా? అయితే, ఈ 6 పరీక్షలు తప్పనిసరి..!

(Tests for women) మహిళలు సాధారణంగా వారి ఆరోగ్యం పట్ల అంతగా శ్రద్ధ చూపరు. ఇటువంటి పరిస్థితిలో ముందుగానే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే రాబోయే ప్రమాదాలను ముందే పసిగట్టవచ్చు. ప్రతి ఒక్కరికీ రెగ్యులర్ మెడికల్ చెకప్ అవసరం. పెరుగుతున్న వయసు జీవక్రియపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా మధుమేహం, రక్తపోటు వంటి అనేక వ్యాధులకు దారితీస్తుంది. మహిళల్లో 30 ఏండ్ల వయస్సులో అనేక రకాల హార్మోన్ల మార్పులు మొదలవుతాయి. ఖచ్చితంగా ఈ వయస్సు మహిళలు 6 పరీక్షలను చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు.

కంప్లీట్ బ్లడ్ పిక్చర్

రక్తహీనత, ఇన్‌ఫెక్షన్, కొన్ని రకాల క్యాన్సర్లను గుర్తించడానికి సీబీపీ నిర్వహిస్తారు. ఎర్ర, తెల్ల రక్త కణాల కౌంటింగ్‌, హిమోగ్లోబిన్, హెమటోక్రిట్, ప్లేట్‌లెట్ల గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఈ పరీక్షను 20 ఏండ్ల వయసు దాటిన మహిళలకు చాలా ముఖ్యమైనది. మన దేశంలో చాలా మంది మహిళలు ఐరన్ లోపాన్ని సహజంగా ఎదుర్కొంటున్నందున ఈ పరీక్ష తప్పనిసరిగా చేయించుకుని తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష

- Advertisement -

లిపిడ్ ప్రొఫైల్.. లిపిడ్స్ అని పిలిచే రక్తంలోని నిర్దిష్ట కొవ్వు అణువుల పరిమాణాన్ని కొలుస్తుంది. సీబీసీతో కొలెస్ట్రాల్‌ని గుర్తించవచ్చు. ఈ పరీక్ష గుండె జబ్బులు, రక్త నాళాల ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి సహాయపడుతుంది. ఆహార అలవాట్లు, ఒత్తిడి, వ్యాయామం, జీవనశైలిని సరిచేయడానికి లిపిడ్ ప్రొఫైల్‌ని ట్రాక్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా థైరాయిడ్ లేదా పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్‌ పేలవమైన లిపిడ్ ప్రొఫైల్‌తో సంబంధం కలిగి ఉంటుంది.

థైరాయిడ్ టెస్ట్

మన దేశంలో ప్రతి 10 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారు. 20 ఏండ్ల వయసు దాటి ప్రతీ ఒక్క మహిళ థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం గుర్తించవచ్చు. థైరాయిడ్ రుగ్మత పురుషులతో పోలిస్తే మహిళల్లో మూడు రెట్లు ఎక్కువ. 35 సంవత్సరాల వయసు తర్వాత హైపోథైరాయిడిజం ప్రమాదం పెరుగుతుంది.

మామోగ్రామ్

మన దేశంలో ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 40 ఏండ్ల వయసు దాటిన తర్వాత మామోగ్రఫీ చేయించుకోవడం చాలా అవసరమని క్యాన్సర్‌ వ్యాధి నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రెండేండ్లకు ఒకసారి మామోగ్రఫీ చేయించుకోవాలి. క్యాన్సర్ కుటుంబ చరిత్ర కలిగిన మహిళలను 20 సంవత్సరాల వయసు నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పరీక్షించాలి.

పాప్ స్మెర్ పరీక్ష

ఈ పరీక్ష ద్వారా గర్భాశయంలోని గత క్యాన్సర్ మార్పులను కనుగొనవచ్చు. 21 సంవత్సరాల వయసు దాటిన మహిళలు ఈ పరీక్ష చేయించుకోవాలని సిఫార్సు చేయబడింది.

రక్తంలో చక్కెర

35-49 ఏండ్ల మధ్య ఉన్న చాలామంది మహిళలు మధుమేహం బారిన పడుతున్నారు. కొందరిలో దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నప్పటికీ.. లక్షణాలు కనిపించక పోవడం వల్ల గుర్తించలేకపోతున్నారు. డయాబెటిస్ రక్తంలో చక్కెర ఆకస్మిక పెరుగుదలకు కారణమవుతుంది. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. రక్తంలో చక్కెర పరీక్షలను సాధార పరీక్షలతోపాటు జరిపించుకోవడం ద్వారా చక్కెర వ్యాధి పెరుగకుండా చూసుకోవచ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి..

చైనాలో డ్రోన్ల వర్షం.. లైట్‌షోలో ఘటన

కుప్పకూలిన వేలాడే వంతెన : 30 మంది విద్యార్థులకు గాయాలు

అణు రియాక్టర్ల నిర్మాణ ప్రణాళికలు ప్రస్తుతానికి లేవు : జపాన్‌

చార్‌ధామ్‌ భక్తుల సంఖ్య పరిమితి ఎత్తివేసిన హైకోర్ట్

13 మంది హజారాలను చంపిన తాలిబాన్‌ : హక్కుల సంఘం ఆరోపణ

షూటింగ్‌లో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌కు ‘గోల్డ్‌’

వీరనారి రాణి దుర్గావతి జయంతి నేడు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement