Taliban : 13 మంది హజారాలను చంపిన తాలిబాన్ : హక్కుల సంఘం ఆరోపణ
Taliban : 13 మంది హజారాలను చట్టవిరుద్ధంగా తాలిబాన్ చంపినట్లు హక్కుల సంఘం ఆరోపిస్తున్నది. హత్యకు గురైన వారిలో ...

కైరో : (Taliban) ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ హస్తగతం చేసుకున్నప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హజారాలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. తాలిబాన్ వీరిని లక్ష్యంగా చేసుకోవడమే వీరి భయానికి కారణంగా చెప్పవచ్చు. అయితే, 13 మంది హజారాలను చట్టవిరుద్ధంగా తాలిబాన్ చంపినట్లు హక్కుల సంఘం ఆరోపిస్తున్నది. హత్యకు గురైన వారిలో ఎక్కువ మంది ఆఫ్ఘన్ సైనికులు తిరుగుబాటుదారులకు లొంగిపోయారని ప్రముఖ హక్కుల సంఘం మంగళవారం తెలిపింది.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ జరిపిన దర్యాప్తు ప్రకారం, ఆగస్టు 30 న మధ్య ఆఫ్ఘనిస్తాన్లోని డేకుండి ప్రావిన్స్‌లోని కహోర్ గ్రామంపైకి దాదాపు 300 మంది తాలిబాన్లు దాడి జరిపి ఈ హత్యలకు పాల్పడ్డారు. బాధితుల్లో 11 మంది ఆఫ్ఘన్ జాతీయ భద్రతా దళ సభ్యులు, ఇద్దరు పౌరులు ఉన్నారు. వీరిలో 17 ఏండ్ల వయసున్న బాలిక కూడా ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న రెండు వారాల తర్వాత ఈ హత్యలకు పాల్పడినట్లు తెలుస్తున్నది.
ఆఫ్ఘనిస్తాన్లోని 3.6 కోట్ల జనాభాలో హజారాలు 9 శాతంగా ఉంటారని ఒక నివేదిక స్పష్టం చేస్తున్నది. వారు సున్నీ-మెజారిటీ దేశంలో షియా ముస్లింలు అయినందున వారిని తరచుగా లక్ష్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ భయంకరమైన దుర్వినియోగాలకు పాల్పడుతున్నారనే దానికి ఈ హజారాల హత్యలే నిదర్శనమని అమ్నెస్టీ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్మార్డ్ తెలిపారు. దీనిపై కామెంట్ చేసేందుకు తాలిబాన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్, బిలాల్ కరీమీలు నిరాకరించారు. అయితే, ఎలాంటి హత్యలు జరుగలేదని దైకుండికి తాలిబాన్ నియమించిన పోలీసు చీఫ్ సాదికుల్లా అబేద్ చెప్పారని హక్కుల సంఘాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి..
షూటింగ్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌కు ‘గోల్డ్’
వీరనారి రాణి దుర్గావతి జయంతి నేడు
గుండె ఆరోగ్యాన్ని కంటితో తెలుసుకోవచ్చు.. అమెరికా పరిశోధన
నీటిలో ఒలికిన నూనెను వేరుచేసే హైడ్రోఫోబిక్ కాటన్.. ఐఐటీ గువాహటి పరిశోధకుల కృషి
అమ్మల చేతితో అమ్మకు పూజలు.. కోల్‌కతాలో కొత్త సంప్రదాయం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

