లిమా : (Shooting) పెరూ రాజధాని లిమాలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణం సాధించాడు. ఇదే సమయంలో జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్.. ప్రపంచ రికార్డును అధిగమించి స్వర్ణం సాధించాడు. ఫైనల్లో 463.4 స్కోర్‌తో జూనియర్ ప్రపంచ రికార్డును మెరుగుపర్చాడు. 456.5 స్కోర్‌తో రెండో స్థానంలో ఫ్రెంచ్ ఆటగాడు లూకాస్ క్రిజ్ నిలువగా.. అమెరికాకు చెందిన గావిన్ బార్నిక్ 446.6 స్కోరుతో కాంస్య పతకం సాధించాడు.
ఇతర భారతీయుల్లో సంస్కర్ హవేలియా 1160 స్కోరుతో 11 వ స్థానంలో, పంకజ్ ముఖేజా 1157 తో 15 వ స్థానంలో, సర్తాజ్ తివానా 1157 తో 16 వ స్థానంలో, గుర్మాన్ సింగ్ 1153 స్కోరుతో 22 వ స్థానంలో నిలిచారు. పెరూలోని లిమాలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణం భారతదేశానికి ఎనిమిదవది. మొత్తం మీద 17 పతకాలతో ఈ సంవత్సరం ప్రపంచ దేశాల్లో భారతదేశం ముందు వరుసలో నిలిచింది. అమెరికా నాలుగు స్వర్ణాలతో 12 పతకాలు సాధించి రెండో స్థానంతో సరిపెట్టుకున్నది.
వీరనారి రాణి దుర్గావతి జయంతి నేడు
గుండె ఆరోగ్యాన్ని కంటితో తెలుసుకోవచ్చు.. అమెరికా పరిశోధన
నీటిలో ఒలికిన నూనెను వేరుచేసే హైడ్రోఫోబిక్ కాటన్.. ఐఐటీ గువాహటి పరిశోధకుల కృషి
అమ్మల చేతితో అమ్మకు పూజలు.. కోల్‌కతాలో కొత్త సంప్రదాయం
గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన జెఫ్ బెజోస్ ‘బ్లూ ఆరిజిన్’
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..