Cases decreased: తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
Cases decreased : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 2 నెలలుగా ఏ దేశంలోనూ ఇన్ఫెక్షన్ పెరుగుదల నమోదుకాలేదు.గత రెండు నెలల్లో...

వాషింగ్టన్ : (Cases decreased) ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 2 నెలలుగా ఏ దేశంలోనూ ఇన్ఫెక్షన్ పెరుగుదల నమోదుకాలేదు.గత రెండు నెలల్లో అమెరికాలో 35 శాతం కేసులు తగ్గిపోగా.. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం కేసులు తగ్గినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మన మధ్య నుంచి కరోనా పూర్తిగా తొలిగిపోలేదు. మన జాగ్రత్తలతోనే దానిని పెరుగకుండా చూసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా పలు దేశాల్లో దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య తగ్గిపోతున్నట్లు గుర్తించారు.
గత 2 నెలల్లో ఏ దేశంలోనూ ఇన్ఫెక్షన్ పెరగలేదు. కొత్త కరోనా కేసుల సంఖ్య తగ్గిపోతుండటంతో, రోగులను దవాఖానల్లో చేర్పించడం తగ్గింది. అమెరికాలో సెప్టెంబర్ 1 న ప్రతిరోజూ వచ్చే కరోనా కేసుల్లో 35 శాతం తగ్గుదల కనిపించింది. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా కేసులు 30 శాతం తగ్గాయి. యూఎస్‌లో కేసుల తగ్గుదలను రెండు నెలల నమూనాగా కూడా చూడవచ్చని స్క్రిప్స్ రీసెర్చ్‌కు చెందిన డాక్టర్ ఎరిక్ టోపాల్ అన్నారు. డెల్టా వేరియంట్ కారణంగా యూఎస్‌లో గతంలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, కరోనాపై ప్రజలకు అవగాహన కారణంగా కేసులు తగ్గుతున్నట్లు మిన్నెసోటా విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్ మైఖేల్ ఓస్టర్‌హోమ్ పేర్కొంటున్నారు.
అమెరికాలో సెప్టెంబర్ 1 తర్వాత కరోనా రోగులు దవాఖానలో చేరే రేటు కూడా 25 శాతం తగ్గింది. 20 సెప్టెంబర్ తర్వాత మరణాల సంఖ్య కూడా తగ్గింది. 10 శాతం తక్కువ మరణాలు నమోదైనట్లు అక్కడి లెక్కలు చెప్తున్నాయి. భారతదేశం, ఇండోనేషియా, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. డెల్టా వేరియంట్ కారణంగా మరణాల సంఖ్య తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. జీరో కోవిడ్ మోడల్‌ను న్యూజిలాండ్ వదిలిపెట్టింది. ఒక్క కేసు కూడా ఉండకూడదనే లక్ష్యాన్ని ప్రస్తుతానికి సాధించలేమని న్యూజిలాండ్ అభిప్రాయపడింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉంటూ మార్గదర్శకాలు పాటించడం ఒక్కటే మన ముందున్న కర్తవ్యం అని న్యూజిలాండ్ హితబోధ చేస్తున్నది. న్యూజిలాండ్‌లో ఎక్కడైనా కరోనా కేసు కనిపిస్తే కనీసం వారం పాటు కఠినమైన లాక్ డౌన్ విధిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇండియన్ పీనల్ కోడ్ ఆమోదించి నేటికి 161 ఏండ్లు
మీరు 30 దాటిన మహిళలా? అయితే, ఈ 6 పరీక్షలు తప్పనిసరి..!
13 మంది హజారాలను చంపిన తాలిబాన్ : హక్కుల సంఘం ఆరోపణ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

