Oldest toilet : జెరూసలెంలో 2,700 ఏండ్ల క్రితం టాయిలెట్ లభ్యం
Oldest toilet : ఇజ్రాయెల్‌లో అతిపురాతన మరుగుదొడ్డి లభ్యమైంది. పురావస్తు శాస్త్రవేత్తలు జెరూసలెంలో జరిపిన తవ్వకాల్లో 2,700 సంవత్సరాల క్రితం నాటి...

జెరూసలెం : (Oldest toilet) ఇజ్రాయెల్‌లో అతిపురాతన మరుగుదొడ్డి లభ్యమైంది. పురావస్తు శాస్త్రవేత్తలు జెరూసలెంలో జరిపిన తవ్వకాల్లో 2,700 సంవత్సరాల క్రితం నాటి అరుదైన టాయిలెట్‌ను కనుగొన్నారు. క్రిస్టియన్ల పవిత్ర నగరంగా పేరుగాంచిన జెరూసలెంలో ప్రైవేట్ బాత్రూమ్లు విలాసవంతమైనవని శాస్త్రవేత్తలు తెలిపారు. అప్పట్లో వీటిని ధనవంతులు మాత్రమే వినియోగించేవారని అధికారులు చెప్తున్నారు.
దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక క్యాబిన్లో మృదువైన, చెక్కిన సున్నపురాయి టాయిలెట్‌ను పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది పాత నగరానికి ఎదురుగా ఉన్న విశాలమైన భవనంలో జరిపిన తవ్వకాల్లో లభించింది. ఈ టాయిలెట్ సౌకర్యవంతంగా కూర్చోవడానికి రూపొందించబడింది. కింద తవ్విన లోతైన సెప్టిక్ ట్యాంక్ కూడా ఉన్నది. పురాతన కాలంలో ఒక ప్రైవేట్ టాయిలెట్ క్యూబికల్ కనిపించడం చాలా అరుదు, ఇప్పటివరకు కొన్నింటిని మాత్రమే కనుగొన్నట్లు తవ్వకం పనుల డైరెక్టర్ యాకోవ్ బిలిగ్ తెలిపారు. ధనవంతులు మాత్రమే ఈ రకం మరుగుదొడ్లను అందుబాటులో పెట్టుకునేవారని ఆయన చెప్పారు. ధనవంతుడుగా ఉండటం అంటే ఆరోజుల్లో టేబుల్ పక్కనే టాయిలెట్ ఉండటమే అని ఆయన వెల్లడించారు.
సెప్టిక్ ట్యాంక్‌లో కనిపించిన జంతువుల ఎముకలు, కుండలు ఆ సమయంలో నివసించే వ్యక్తుల జీవనశైలి, ఆహారం, ప్రాచీనకాలంలో ఎదుర్కొన్న వ్యాధులను వెలుగులోకి తెస్తాయని ఆర్కియాలజీ అధికారులు తెలిపారు. ఆ కాలం నాటి రాతి పనులు, స్తంభాలను కూడా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సమీపంలో ఉన్న తోటల్లో పండ్ల మొక్కలు, అలంకరణ మొక్కలతో ఉండేవన్న ఆధారాలు ఉన్నాయని వారు చెప్పారు. వీటి ద్వారా అక్కడ నివసించే వారు చాలా ధనవంతులు అని తెలుస్తున్నాయని వారు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ ఆకస్మిక బదిలీ
చర్యలు లేకుంటే ఉద్యమం తప్పదు : రాకేశ్ తికాయత్
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
హర్మన్‌ప్రీత్‌సింగ్, గుర్జీత్కౌర్లకు ఉత్తమ క్రీడాకారుల అవార్డులు
సిక్కు పోలీసుకు హ్యూస్టన్ పోస్టాఫీస్ గౌరవం
పరిస్థితి మెరుగుపడకపోతే.. నీటి సంక్షోభం తప్పదు : యూఎన్ హెచ్చరిక
తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
ఇండియన్ పీనల్ కోడ్ ఆమోదించి నేటికి 161 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

