ISI chief : ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ ఆకస్మిక బదిలీ
ISI chief : పాకిస్తాన్ ఆర్మీ బుధవారం అనూహ్య నిర్ణయాలు తీసుకున్నది. పలువురు ఉన్నతాధికారులను ఆకస్మికంగా బదిలీ చేసింది. వీరిలో ప్రస్తుతం ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్న...

ఇస్లామాబాద్ : (ISI chief) పాకిస్తాన్ ఆర్మీ బుధవారం అనూహ్య నిర్ణయాలు తీసుకున్నది. పలువురు ఉన్నతాధికారులను ఆకస్మికంగా బదిలీ చేసింది. వీరిలో ప్రస్తుతం ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్ కూడా ఉన్నారు. ఫయాజ్ హమీద్‌ను పెషావర్ కార్ప్స్ కమాండర్‌గా బదిలీ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముచెత్తింది. అయితే, ఐఎస్ఐ చీఫ్ వంటి కీలక పదవికి వెంటనే భర్తీ చేయలేదు. ఆయన స్థానంలో మరెవరినీ ప్రకటించలేదు.
కాగా, మరో రెండు సీనియర్ స్థాయి పోస్టింగ్‌లను కూడా పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది.లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అమీర్‌ను గుజ్రాన్ వాలా కార్ప్స్ కమాండర్‌గా, లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్‌ను ఆర్మీ క్వార్టర్ మాస్టర్ జనరల్ (క్యూఎమ్జీ) గా నియమించింది.
2019 జూన్ 16 న గూఢచార సంస్థ అధిపతిగా హమీద్ నియమితులయ్యాడు. అతను గతంలో అంతర్గత భద్రతా అధిపతిగా పనిచేశాడు. అతను ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బజ్వాకు దగ్గరి వ్యక్తిగా పరిగణలో ఉన్నాడు. ఇంటా, బయట అనేక భద్రతా సవాళ్ల మధ్య కీలకమైన సమయంలో ఐఎస్ఐ అధిపతిగా నియమితులయ్యాడు.
గత ఆగస్ట్ నెలలో తాలిబాన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో కీలక మార్పులను ఫయాజ్ హమీద్ భౌతికంగా పర్యవేక్షించాడు. సెప్టెంబరులో కాబూల్‌ను సందర్శించిన అతడు.. తాలిబాన్ శ్రేణుల మధ్య విభేదాల గురించి పుకార్లు వచ్చినప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో అంతా సవ్యం అవుతుందని మీడియాకు చెప్పి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
ఇవి కూడా చదవండి..
చర్యలు లేకుంటే ఉద్యమం తప్పదు : రాకేశ్ తికాయత్
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
హర్మన్‌ప్రీత్‌సింగ్, గుర్జీత్కౌర్లకు ఉత్తమ క్రీడాకారుల అవార్డులు
సిక్కు పోలీసుకు హ్యూస్టన్ పోస్టాఫీస్ గౌరవం
పరిస్థితి మెరుగుపడకపోతే.. నీటి సంక్షోభం తప్పదు : యూఎన్ హెచ్చరిక
తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
ఇండియన్ పీనల్ కోడ్ ఆమోదించి నేటికి 161 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

