Houston’s post office : సిక్కు పోలీసుకు హ్యూస్టన్ పోస్టాఫీస్ గౌరవం
Houston’s post office : దారుణ హత్యకు గురైన ఇండో-అమెరికన్ సిక్కు పోలీసు అధికారికి నిజమైన నివాళి లభించింది. ఆయన సేవలకు గౌరవ సూచకంగా ఆయన పేరును...

హ్యూస్టన్ : (Houston’s post office) దారుణ హత్యకు గురైన ఇండో-అమెరికన్ సిక్కు పోలీసు అధికారికి నిజమైన నివాళి లభించింది. ఆయన సేవలకు గౌరవ సూచకంగా ఆయన పేరును వెస్ట్ హ్యూస్టన్‌లోని ఒక పోస్టాఫీస్‌కు పెట్టారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సందీప్ సింగ్ ధలివాల్ (42) హారిస్ కౌంటీ డిప్యూటీ షెరీఫ్. ముగ్గురు పిల్లల తండ్రి. 2019 సెప్టెంబర్ 27 న ట్రాఫిక్ నిర్వహణలో ఉన్న ధలివాల్‌ను గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. 2015 లో టెక్సాస్‌లో పనిచేసిన మొదటి సిక్కు పోలీసు అధికారిగా ధలివాల్ నిలిచారు. గడ్డం పెంచుకునేందుకు, తలపాగా ధరించేందుకు అనుమతి పొందిన అమెరికాలో మొదటి సిక్కు పోలీసు అధికారి.
ధలివాల్ పేరును వెస్ట్ హ్యూస్టన్ పోస్టాఫీస్‌కు పెట్టిన విషయాన్ని
హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం (హెచ్‌సీఎస్) బుధవారం ఒక ట్వీట్లో వెల్లడించింది. ‘సందీప్ సింగ్ ధలివాల్ జ్ఞాపకార్థం వెస్ట్ హారిస్ కౌంటీలోని పోస్టల్ ఆఫీసు పేరు మార్చడం చాలా గొప్ప విషయం. ఇది ఆయనకు గౌరవసూచకం. ఆయనను స్మరించుకునే అవకాశం కల్పించిన హారిస్ కౌంటీ కమీషనర్స్ కోర్టుకు, అమెరికా పోస్టల్ విభాగం అధికారులకు, సిక్కు జాతికి కృతజ్ఞతలు’ అని ట్వీట్లో రాశారు.
ఇవి కూడా చదవండి..
పరిస్థితి మెరుగుపడకపోతే.. నీటి సంక్షోభం తప్పదు : యూఎన్ హెచ్చరిక
తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
ఇండియన్ పీనల్ కోడ్ ఆమోదించి నేటికి 161 ఏండ్లు
మీరు 30 దాటిన మహిళలా? అయితే, ఈ 6 పరీక్షలు తప్పనిసరి..!
13 మంది హజారాలను చంపిన తాలిబాన్ : హక్కుల సంఘం ఆరోపణ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

