Flood Dining : వెరైటీ రెస్టారెంట్.. దీని గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే
వెరైటీ రెస్టారెంట్.. దీని గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే | సాధారణంగా రెస్టారెంట్లు ఎక్కడ ఉంటాయి. రోడ్డు పక్కన కదా ఉండేది. కానీ.. ఈ రెస్టారెంట్ చూడండి.. నది ఒడ్డున

సాధారణంగా రెస్టారెంట్లు ఎక్కడ ఉంటాయి. రోడ్డు పక్కన కదా ఉండేది. కానీ.. ఈ రెస్టారెంట్ చూడండి.. నది ఒడ్డున ఉంది. కూర్చునే కుర్చీలు కూడా నీళ్లలో తడుస్తాయి. ఆ రెస్టారెంట్‌కు వెళ్తే మోకాళ్ల లోతు వరకు నీళ్లు వస్తాయి. ప్యాంటు తడవాల్సిందే. అందుకే ఆ రెస్టారెంట్ స్పెషల్ అయింది. అందరూ ఇప్పుడు ఆ రెస్టారెంట్‌కు క్యూ కడుతున్నారు.
ఇంతకీ ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉందో తెలుసా? థాయిలాండ్‌లో. చావో ఫ్రాయా అనే నది ఒడ్డునే ఈ రెస్టారెంట్ ఉన్నది. నిజానికి.. ఆ నది ఒక టూరిస్ట్ స్పాట్. అందుకే ఆ నది ఒడ్డున చాలా రెస్టారెంట్లు వెలిశాయి. అయితే.. ఇటీవల ఆ నది నీళ్లు ముందుకు వచ్చేయడంతో రెస్టారెంట్లు అన్నీ మూతపడ్డాయి. కానీ.. ఒక్క రెస్టారెంట్ మాత్రం ఆ నీటినే క్యాష్ చేసుకొని సరికొత్త రెస్టారెంట్‌గా అవతరించింది.

చావోప్రాయా అంటిక్ కేఫ్ యజమాని జుటిమేనన్ మాత్రం నది ఒడ్డున ఉన్న నీటిలోనే డైనింగ్ ఏరియాను ఏర్పాటు చేశాడు. డైనింగ్ ఏరియాకు వచ్చి అక్కడ కూర్చొని కింద కాళ్లకు తాకుతున్న అలలను ఎంజాయ్ చేస్తూ ఫుడ్‌ను ఆరగిస్తున్నారు. కస్టమర్లు కూడా వెరైటీ రెస్టారెంట్ నచ్చి అక్కడికి క్యూ కడుతున్నారు.
ఆ రెస్టారెంట్ ప్రత్యేకతను వివరిస్తూ.. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో నెటిజన్లు కూడా ఆ రెస్టారెంట్‌ను చూసి వావ్ అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లు తోమేవారు.. ఇప్పుడు అదే బొగ్గుతో కాఫీ, ఐస్‌క్రీంలు తయారీ.. ఎందుకు?
Love Story | డేటింగ్ యాప్‌లో పరిచయమై.. పరిణయమాడిన వృద్ధ ప్రేమికులు
Guinness Record : రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

