Pic of the Day : ఈ ఫోటోను చూసి షాక్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ ఈ ఫోటోలో ఏముంది?
ఈ ఫోటోను చూసి షాక్ అవుతున్న నెటిజన్లు | ఈ ఫోటోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఆ ఫోటో దేనికి సంబంధించింది

ఈ ఫోటోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఆ ఫోటో దేనికి సంబంధించింది అంటారా? మీరు పైన చూస్తున్న ఫోటో అదే. పెద్ద బండరాయికి సంబంధించిన ఫోటో అది. పెద్ద బండరాయి మధ్యలో సమానంగా చీలిపోయి ఉంది. 30 ఫీట్ల ఎత్తు, 25 ఫీట్ల వెడల్పుతో ఉన్న ఆ బండరాయి సౌదీ అరేబియాలోని టైమా ఒయాసిస్‌లో ఉంది. దాన్ని చూసిన నెటిజన్లు అయితే ముక్కున వేలేసుకుంటున్నారు.
ఆ బండరాయిని గ్రహాంతరవాసులే అలా చీల్చి ఉంటారని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. వేరే గ్రహం నుంచి లేజర్ పాయింటర్ ద్వారా దాన్ని చీల్చి ఉంటారు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

అయితే.. ఆ బండరాయి మిస్టరీని జియాలజిస్ట్ చెర్రీ లెవిస్ ఛేదించారు. ఆ బండరాయి అలా సమానంగా చీలిపోవడానికి కారణం.. ఫ్రీజ్ థా వెథరింగ్ ఎఫెక్ట్ అని స్పష్టం చేశారు. నీళ్లు ఆ బండరాయి మీదకు చేరి.. దానికి పగుళ్లు ఏర్పడటంతో అలా సమానంగా చీలిపోయే అవకాశం ఉంటుందని.. దాన్నే ఫ్రీజ్ థా వెథరింగ్ ఎఫెక్ట్ అంటారని ఆయన స్పష్టం చేశారు.
అలా బండరాయి సగానికి చీలిపోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని లెవిస్ అన్నారు. లెవిస్ చెప్పిన విషయాన్ని కొందరు నమ్మినా.. మరికొందరు మాత్రం… ఏదో హైయ్యర్ టెక్నాలజీని ఉపయోగించి.. ఆ బండరాయిని అలా సమానంగా చీల్చారని కొందరు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Flood Dining : వెరైటీ రెస్టారెంట్.. దీని గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే
ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లు తోమేవారు.. ఇప్పుడు అదే బొగ్గుతో కాఫీ, ఐస్‌క్రీంలు తయారీ.. ఎందుకు?
Love Story | డేటింగ్ యాప్‌లో పరిచయమై.. పరిణయమాడిన వృద్ధ ప్రేమికులు
Guinness Record : రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

