ఆ బాలిక వయసు ఎంతో తెలుసా? కేవలం 10 ఏండ్లు. కానీ.. తను చేస్తున్న పని చేసి షాక్ అవుతారు. 10 ఏండ్ల పిల్లలు ఏం చేస్తారు? బుద్ధిగా చదువుకుంటారు. కానీ.. ఈ బాలిక మాత్రం ఫిట్నెస్ ఎక్స్పర్ట్లకు సవాల్ విసురుతోంది. తన చేస్తున్న వర్కవుట్స్ చేస్తే.. అందరూ నోరెళ్లబెట్టాల్సిందే.
యూకేకు చెందిన ఎజ్జినా అట్కిన్సన్ గురించే మనం మాట్లాడుకునేది. ప్రస్తుతం తన వెయిట్‌లిఫ్టింగ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కండలు తిరిగిన వీరులే తన వెయిట్‌లిఫ్టింగ్ స్కిల్స్ చూసి నోరెళ్లబెడుతున్నారు.
Meet Aeryn-Ejjina Atkinson, a 10-year-old girl who beat ADULTS in a strongwoman contest on August 22. The young girl from England won gold in the silver-dollar lift by being the tiniest person to show they could lift 3x their weight—in her case, a total of more than 200 pounds. pic.twitter.com/lDf5yaC6Pj
— NowThis (@nowthisnews) September 1, 2021
తనకు 7 ఏండ్ల వయసు ఉన్నప్పటి నుంచే.. ఎజ్జినా వెయిట్‌లిఫ్టింగ్ మీద ఆసక్తి పెంచకుందట. అప్పటి నుంచే బరువులను ఎత్తేదట. తనలో ఉన్న ఆ స్కిల్స్‌ను గమనించిన తన తండ్రి క్రేగ్… తనకు అప్పటి నుంచే ఫిట్నెస్ ట్రెయినింగ్ ఇవ్వడం ప్రారంభించాడట. స్కూల్‌కు వెళ్లకముందే.. తెల్లవారుజామునే లేచి.. ఓ రెండు మూడు గంటలు ఇదే పని. అందుకే.. ఇప్పుడు తను అంతగా రాటు తేలింది.
తనకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలోనే తనలో ఉన్న ఆ ఇష్టాన్ని నేను గుర్తించాను. తనకు ఒలింపిక్స్‌కు వెళ్లాలని ఉంది. కామన్వెల్త్ గేమ్స్, క్రాస్ ఫిట్ గేమ్స్.. ఇలా.. అన్ని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్‌లో పాల్గొని.. మెడల్స్ గెలుచుకోవాలని ఉంది. అందుకే.. తను ఇప్పటి నుంచే.. వెయిట్‌లిఫ్టింగ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది.. అంటూ తన తండ్రి చెప్పారు.
ఇటీవల నిర్వహించిన స్ట్రాంగ్ ఉమెన్ కంటెస్ట్‌లో తనకంటే వయసులో పెద్దవారైన వెయిట్ లిఫ్టర్స్ను ఓడించి.. రికార్డు సృష్టించింది ఎజ్జినా. తన వెయిట్లిఫ్టింగ్కు సంబంధించిన వీడియోలు చూస్తే మీకే అర్థం అవుతుంది.. తన సత్తా ఏంటో?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : నెట్టింట్లో మిల్క్ క్రేట్ చాలెంజ్!
Viral Video : ద్యావుడా.. పుచ్చకాయలను ఇలాంటి పనులకు కూడా వాడుతారా?
Krishna Janmashtami 2021 : ఈ చిన్నారి క్యూట్ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే.. వైరల్ వీడియో
World’s Highest Movie Theatre : ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేటర్.. ఇండియాలో ప్రారంభం