రాజన్న సిరిసిల్ల : రోడ్డు ప్రమాదంలో(Road accident) ఓ కానిస్టేబుల్ మృతి(Constable dies) చెందాడు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి చెందిన అజ్మీరా కల్యాణ్ నాయక్(29) నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి 7 వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
కాగా, బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో కల్యాణ్ నాయక్‌ను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుడి స్వగ్రామం గర్జనపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య సుష్మ, కుమార్తె అభియుక్త, కుమారుడు అభిషేక్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు.. నిందితుడు కామారెడ్డి వాసిగా గుర్తింపు
Siddipeta | సిద్దిపేటలో ఉపాధి హామీ పనుల్లో అపశృతి.. తల్లీకూతురు మృతి