Siddipeta | సిద్దిపేటలో ఉపాధి హామీ పనుల్లో అపశృతి.. తల్లీకూతురు మృతి
Siddipeta | సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. అక్కన్నపేట మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామంలో ఓ ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మృతి చెందారు.
Siddipeta | సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. అక్కన్నపేట మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామంలో ఓ ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మృతి చెందారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది.
గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కొంత మంది కూలీలు ఉపాధి హామీ పనుల నిమిత్తం.. గ్రామ శివారుకు వెళ్లారు. అక్కడ పనులు చేస్తుండగా.. ఉన్నట్టుండి మట్టి దిబ్బ కూలిపోయింది. ఈ మట్టి దిబ్బల కింద పడి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను కందరపు సరోజన(52), ఆమె కూతురు మమత(25)గా పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
Nagoba Jatara | వైభవంగా నాగోబా జాతర.. పోటెత్తిన భక్తులు
Social Media | ముదిరిపోయిన సెల్‌ఫోన్ వ్యసనం.. సోషల్ మీడియా బానిసలుగా విద్యార్థులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

