Nagoba Jatara | వైభవంగా నాగోబా జాతర.. పోటెత్తిన భక్తులు
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుక అయిన నాగోబా జాతర (Nagoba Jatara) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. రెండో రోజైన గురువారం గిరిజన సంప్రదాయ వేడుకకు భక్తులు పోటెత్తారు. నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు ఇంద్రవెల్లి లోని కేస్లాపూర్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కేస్లాపూర్: ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుక అయిన నాగోబా జాతర (Nagoba Jatara) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. రెండో రోజైన గురువారం గిరిజన సంప్రదాయ వేడుకకు భక్తులు పోటెత్తారు. నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు ఇంద్రవెల్లి లోని కేస్లాపూర్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా, జాతర సందర్భంగా శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు కలెక్టర్ రాజర్షి షా సెలవు ప్రకటించారు.
మెస్రం వంశీయులు మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజతో నాగోబా జాతర ప్రారంభమైంది. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి బారులుదీరి నాగోబాను దర్శించుకున్నారు. మహాపూజ అనంతరం 52 జతల (104 మంది) కొత్తకోడళ్లకు నాగోబా సన్నిధిలో పరిచయ (బేటింగ్) కార్యక్రమాన్ని మెస్రం వంశీయులు పెద్దల సమక్షంలో నిర్వహించారు. అనంతరం కొత్త కోడళ్లకు నాగోబాను దర్శించుకునే అవకాశం కల్పించారు. సతిక్ దేవత, నాగోబాను దర్శించుకున్న కొత్తకోడళ్లు మెస్రం వంశీయుల పెద్దల ఆశీస్సులు తీసుకుని, మెస్రం వంశీయుల కోడళ్లుగా మారారు. తర్వాత సంప్రదాయబద్ధంగా గోవాడ్‌లో ప్రవేశం కల్పించారు.
అవ్వాల్ దేతకు పూజలు
మహిళలతోపాటు కొత్తకోడళ్ల ఆధ్వర్యంలో 22 కితలవారీగా అవ్వాల్ దేవతకు సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేశారు. నైవేధ్యం సమర్పించి అవ్వాల్ దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఉపవాస దీక్షలను విరమించి సామూహిక భోజనాలు చేశారు. గోవాడ్‌లో కొత్త కోడళ్లు, మహిళలు దీపాలు వెలిగించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, ఉట్నూర్ సీఐ మొగిలి, ఇంద్రవెల్లి ఎస్ఐ సునీల్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

