Social Media | ముదిరిపోయిన సెల్‌ఫోన్ వ్యసనం.. సోషల్ మీడియా బానిసలుగా విద్యార్థులు
పాఠశాల విద్యార్థుల్లో సెల్‌ఫోన్ వ్యసనం ముదిరిపోయింది. వారిలో చాలా మంది సోషల్ మీడియా మోజులో చిక్కుకుపోయారు. 14-16 ఏండ్ల మధ్య వయస్కుల్లో ఏకంగా 82% మంది తమ స్మార్ట్ఫోన్లను సోషల్ మీడియా కోసమే ఉపయోగిస్తున్నారు.
- 82% మంది సోషల్ మీడియాకే అంకితం
- 34% మంది వద్ద సొంత స్మార్ట్ఫోన్లు
- విద్యకు వినియోగించేవారు తక్కువే
- ఏఎస్ఈఆర్ నివేదికలో చేదు నిజాలు
Social Media | హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యార్థుల్లో సెల్‌ఫోన్ వ్యసనం ముదిరిపోయింది. వారిలో చాలా మంది సోషల్ మీడియా మోజులో చిక్కుకుపోయారు. 14-16 ఏండ్ల మధ్య వయస్కుల్లో ఏకంగా 82% మంది తమ స్మార్ట్ఫోన్లను సోషల్ మీడియా కోసమే ఉపయోగిస్తున్నారు.
వయసులవారీగా చూస్తే.. 14 ఏండ్ల వయస్సుల్లో 79% మంది, 15 ఏండ్ల వయస్కుల్లో 82.2% మంది, 16 ఏండ్ల వయస్కుల్లో 82.5% మంది సోషల్ మీడియాలో మునిగిపోతున్నట్టు వార్షిక విద్యాస్థాయి నివేదిక (యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు) వెల్లడించింది. 14-16 ఏండ్ల వయస్కులు విద్యకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు స్మార్ట్ఫోన్లను అంతంతమాత్రంగానే ఉపయోగిస్తున్నట్టు ఈ నివేదిక తేల్చింది.
బాలురే స్మార్ట్
- బాలికలతో పోల్చితే బాలురే అధికంగా స్మార్ట్ఫోన్లను, సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నట్టు ఏఎస్ఈఆర్ వెల్లడించింది.
- రాష్ట్రంలోని 96% మంది విద్యార్థుల ఇండ్లల్లో స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. 97% మంది బాలురు, 94%మంది బాలికల ఇండ్లల్లో స్మార్ట్ఫోన్లు ఉన్నట్టు తేలింది.
- సామాజిక మాధ్యమాల నుంచి రక్షణ పొందే విషయమై విద్యార్థులకు అవగాహన బాగానే ఉన్నది. ఖాతాను బ్లాక్ చేయడంపై 67.2% మంది, పాస్వర్డ్ మార్చడం 62% మంది, ప్రొఫైల్‌ను గోప్యంగా ఉంచుకోవడంపై 60.8% మంది విద్యార్థులు అవగాహన కలిగి ఉన్నారు.
- చదువు కోసం స్మార్ట్ఫోన్లను వాడుతున్న విద్యార్థులు 61.1% మందే. బాలురలో 60.7%, బాలికల్లో 61.5% మంది చదువుల కోసం స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు.
- విద్యార్థుల్లో 34.3% మందికి సొంత స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. బాలురలో 39% మంది, బాలికల్లో 29% మంది సొంత స్మార్ట్ఫోన్లను కలిగి ఉన్నారు.
- వయసులవారీగా చూస్తే.. 16 వయస్కుల్లో 46.3%, 15 ఏండ్ల వయస్కుల్లో 29%, 14 ఏండ్ల వయస్కుల్లో 31.11% మంది స్మార్ట్ఫోన్లను కలిగి ఉన్నారు.
- విద్యార్థుల్లో 88.6% మంది యూట్యూబ్‌లో వీడియోలను వీక్షించేందుకు, 89% మంది అలారమ్ కోసం, 84.4% మంది సమాచార సేకరణ కోసం స్మార్ట్ఫోన్లను వాడుతున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

