MLC Kavitha | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ స్కూల్స్, హాస్టళ్లలో వరుసగా చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆమె ధ్వజమెత్తారు. ఒకే ఒక్క రోజులో మూడు జిల్లాల్లో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం బాధాకరమైన విషయమన్నారు. ఇంకెంత మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో బాధపడాలని ఆమె బాధ్యతారాహిత్యంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా పొలిటికల్ డ్రామాలో మునిగి తేలుతున్నారని, తెలంగాణ భవిష్యత్ అయినటువంటి మన పిల్లల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రతి బిడ్డకు సురక్షితమైన, పోషకమైన ఆహారం పొందే హక్కు ఉంది. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో విద్యార్థులను పట్టించుకోవడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
నారాయణపేట జిల్లా ధన్వాడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం తర్వాత ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. మరో 19 మంది విద్యార్థులు కడుపునొప్పి అనడంతో సిబ్బంది హెచ్ఎం నర్సింహాచారికి విషయం తెలిపారు. ప్రభుత్వ దవాఖాన డాక్టర్ అనూష సిబ్బందితో పాఠశాలకు చేరుకొని విద్యార్థులను పరీక్షించారు. కలుషిత ఆహారం, నీటి కారణంగా అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 16మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, దవాఖానకు తరలించి చికిత్స అందించారు. కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేశారు. నలుగురు విద్యార్థులు దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహంలో 170 మంది విద్యార్థినులు ఉంటూ సమీప పాఠశాలల్లో చదువుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం తొమ్మిదో తరగతి విద్యార్థినులు ఆర్ దుర్గ, ఎస్ మహేశ్వరి, ఎనిమిదో తరగతి ఆర్ కనిష్మ, బీ అక్షిత, ఆరో తరగతి బీ పూజిత వాంతులు చేసుకున్నారు. వసతి గృహం సిబ్బందికి పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. వసతి గృహం వద్దకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు విద్యార్థినులు ఏ దవాఖానలో చికిత్స పొందుతున్నది చెప్పకుండా అధికారులు దాచారు. తాము చెప్పిన వివరాలే మీడియాకు చెప్పాలి అన్నట్టు విద్యార్థినులను సన్నద్ధం చేసినట్టు స్పష్టంగా కనిపించింది. సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా అధికారి శంకర్ విద్యార్థినులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.
The repeated incidents of food poisoning in Telangana Government schools and Hostels lay bare their alarming and continued neglect under the Congress regime.
In just one day, 50 cases were reported across three districts. How many more innocent children must suffer before this… pic.twitter.com/ZSAVQ7eJNA
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 30, 2025
ఇవి కూడా చదవండి..
Harish Rao | విశ్రాంత ఉద్యోగుల ఆవేదన ఈ ప్రభుత్వానికి పట్టదా?: హరీశ్‌రావు
Govt Junior Colleges | రండి బాబూ రండీ.. సర్కారు కాలేజీల్లో చేరండి.. ఇంటర్ బోర్డు సరికొత్త ప్రచారం