Errolla Srinivas | విలువలతో కూడిన రాజకీయాలు చెయ్యాలి. అలాంటి విలువలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లేవని.. రేవంత్ రెడ్డి బూతులతో పోటీపడుతున్నాడని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే ముఖ్యమంత్రి కుర్చీ పరువు పోతుంది. రేవంత్ రెడ్డిలా మేము బూతులు మాట్లాడవచ్చు. కేసీఆర్ మాకు సంస్కారం నేర్పించారు. రియల్ ఎస్టేట్ రంగంలోమొత్తం బ్రోకర్ దందా జరుగుతుంది. కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రా ప్రాంతానికి తరలించుకొని పోతుంటే, జరుగుతున్నఅన్యాయంపైన కేసీఆర్ మాట్లాడారు. కృష్ణార్జునులు అయిన కేటీఆర్, హరీష్ రావులనే కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేక పోతున్నారు. రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణను అభివృద్ధి చేసి చూపించాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అభివృద్ధి కుంటుపడింది. నల్లమల బిడ్డను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అయిన తరువాత పాలమూరు జిల్లాకు ఏం చేశావో సమాధానం చెప్పు అని ప్రశ్నించారు.
ఈ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసి పెట్టుకోండి. జేజమ్మ దిగి వచ్చిన బీఆర్ఎస్ పార్టీనీ ఏం చెయ్యలేరని ధీమా వ్యక్తం చేశారు.
Jagadish Reddy | రేవంత్‌రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు : జగదీశ్‌రెడ్డి
Bus overturns | మహబూబ్‌నగర్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు : వీడియో
Hrithik Roshan | పెళ్లి వేడుకలో కుమారులతో కలిసి స్టెప్పులేసిన హృతిక్ రోషన్… వీడియో వైరల్