పెద్దపల్లి : సింగరేణి సంస్థ(Singareni) జీడికే- 2 గనిలో గుండెపోటుతో ఓ కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నరేష్ అనే కోల్ కట్టర్ కార్మికుడి మృతి మొదటి షిఫ్ట్ డ్యూటీకి వెళ్లాడు. ఆయనకు మాస్టర్ పడే సమయంలో గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. సకాలంలో అంబులెన్స్ రాకపోవడం వల్లనే కార్మికుడు మృతి చెందాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. నరేష్ మృతిని ప్రమాద సంఘటనగా గుర్తించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నరేష్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Yadagirigutta | ముక్కోటి పర్వదినం.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం
Indiramma House | జాగ లేకుంటే ఇందిరమ్మ ఇల్లు లేనట్టే! మంత్రి పొంగులేటి వెల్లడి