Kodangal | వికారాబాద్ : ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు.. అంతకంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ కాదు.. చివరకు సర్పంచ్ కాదు, కార్పొరేటర్ కాదు, కనీసం వార్డ్ మెంబర్ కాదు.. కానీ ఆయనకు పోలీస్ కాన్వాయ్, స్కూల్ పిల్లలతో పరేడ్, చివరికి వికారాబాద్ కలెక్టర్ బాడీగార్డ్ అయ్యాడు. అందరికీ ఆయన సీఎం అన్న.. అయితే ఆ జిల్లాలో మాత్రం ఆయనే సీఎం అనడానికి ఈ వీడియోనే సాక్ష్యం.
మరి ఆయన ఎవరో తెలుసా.. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసేందుకు తిరుపతి రెడ్డి భారీ కాన్వాయ్‌తో వచ్చాడు. ఊరి బయటనే ఆయన కాన్వాయ్ ఆగిపోయింది. ఎండలో బడి పిల్లలు ఆయనకు పరేడ్‌తో స్వాగతం పలికారు. ఇక ఏ హోదా లేని తిరుపతి రెడ్డి పక్కనే వికారాబాద్ కలెక్టర్ ఓ సామాన్యుడిలా ఉండిపోయారు. ఇక స్థానిక నాయకులు వంగి వంగి దండాలు పెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వీటన్నింటినీ ఎంజాయ్ చేస్తూ తిరుపతి రెడ్డి ఓ ముఖ్యమంత్రి అన్నలా కాకుండా.. తానే ముఖ్యమంత్రిలా ఫీలైపోయారు.
తెలంగాణ సీఎం పేరు అందరూ మర్చిపోయేది ఇందుకే అన్న విషయం సీఎం తెలుసుకోవాలి అని సోషల్ మీడియాలో సైటెర్లు వేస్తున్నారు. కుటుంబ పాలన అన్నోడు.. ఈ వీడియో చూడాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొన్ని రోజులైతే తెలంగాణ సీఎం ఎవరనే ప్రశ్నకు పిల్లలు అనుముల తిరుపతి రెడ్డి తమ్ముడు అనే సమాధానం రాసిన ఉపాధ్యాయులు మార్కులు వేయాల్సిందే అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
BIG EXCLUSIVE
ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు,జడ్పిటిసి, ఎంపిటిసి కాదు, సర్పంచ్ కాదు, కార్పొరేటర్ కాదు, కనీసం వార్డ్ మెంబర్ కాదు..
కానీ ఆయనకు పోలీస్ కాన్వాయ్, స్కూల్ పిల్లలతో పరేడ్, చివరికి వికారాబాద్ కలెక్టర్ బాడీగార్డ్ అయ్యాడు
అందరికీ ఆయన సీఎం అన్న
అయితే ఆ జిల్లాలో మాత్రం ఆయనే… pic.twitter.com/evjI4qfe9P— Telugu Scribe (@TeluguScribe) January 10, 2025
ఇవి కూడా చదవండి..
Jangaon | జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
KTR | రేస్ రద్దుతోనే ప్రభుత్వానికి నష్టం.. ఏసీబీ విచారణాధికారులతో కేటీఆర్ స్పష్టీకరణ
Mahabubnagar | భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే : శ్రీనివాస్ గౌడ్