హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : ఫార్ములా ఈ-కార్ రేసును కొనసాగించకపోవడం వల్ల, ఒప్పందాలను ప్రభు త్వం క్యాబినెట్ ఆమోదం లేకుండా రద్దు చేయడం వల్లనే ఆర్థిక నష్టం వాటిల్లిందని, ఒప్పందాన్ని రద్దుచేసి ప్రభుత్వానికి నష్టం కలిగించిన సీఎం రేవంత్‌రెడ్డిని ఈ కేసులో ఎం దుకు భాగస్వామిగా చేర్చలేదని ఏసీబీ అధికారులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించినట్టు సమాచారం. ప్రపంచంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తేవాలని ఫార్ములా ఈ-కార్ రేస్‌ను నిర్వహించామని, దాని నిర్వహణకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలకు మంత్రి హోదాలో సంతకా లు చేశానని ఏసీబీ అధికారుల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చినట్టు సమాచారం. ఫా ర్ములా ఈ-కార్ రేస్‌కు సంబంధించి గురువారం ఉదయం ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు.
నలుగురు విచారణాధికారుల బృందం సుమారు 7 గంటల పాటు.. 82 ప్రశ్నలు అడిగింది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ ఓపిగ్గా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఫైల్ మూమెంట్ పైన ఏసీబీ సంధించిన ప్రశ్నలకు ‘ఫైల్ మూమెంట్‌కు చట్టపరంగా బాధ్యత వహించే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎందుకు నోటీసు ఇవ్వలేదు?’ అని కేటీఆర్ ప్రశ్నించినట్టు సమాచా రం. ముఖ్యంగా క్యాబినెట్ ఆమోదం లేకుం డా డబ్బులు ఎలా బదిలీ చేశారనే అంశం గు రించి ఏసీబీ ప్రశ్నించినప్పుడు.. ‘క్యాబినెట్ ఆమోదం లేకుండా రేసును రద్దు చేసిన సీఎం ను బాధ్యుడిగా చేయాల్సి వస్తుంది. ఆ పని ఎందుకు చేయలేదు’ అని కేటీఆర్ అడిగినట్టు తెలిసింది. రేసు రద్దు వల్ల జరిగిన నష్టానికి ముఖ్యమంత్రి పైన కూడా కేసు నమోదు చే యాలని కేటీఆర్ కోరినట్టు సమాచారం. కొ న్ని ప్రశ్నలనే తిప్పితిప్పి విచారణ బృందం అడిగినట్టు తెలిసింది.
విచారణ అధికారులుగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతిరాజ్, అడిషనల్ ఎస్పీలు శివరాం శర్మ, నరేందర్‌రెడ్డి, కేసు విచారణాధికారి డీఎస్పీ మాజీద్ ఖాన్ కలిసి ఓ ప్రత్యేక గదిలో కేటీఆర్‌ను ప్రశ్నించారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చిన అధికారులు, మళ్లీ విచారణ కొనసాగించారు. విచారణకు కేటీఆర్ లాయర్, మాజీ ఏఏజీ రామచందర్రావును ఏసీబీ అధికారులు లోనికి అనుమతించారు. సీనియర్ ఐఏఎస్ అర్వింద్‌కుమార్‌తోపాటు, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్‌ను ఎన్ని ప్రశ్నలు అడిగినా సూటిగా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. విచారణ అనంతరం తనను ప్రశ్నించిన అధికారులతో కాసేపు కేటీఆర్ మాట్లాడారు. ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఈడీ అధికారులు ప్రశ్నించి, స్టేట్మెంట్ను రికార్డు చేశారు. బుధవారం ఏసీబీకి ఇచ్చిన సమాధానాలే ఈడీకి కూడా చెప్పినట్టు సమాచారం.
కేటీఆర్ : రేసును హైదరాబాద్‌లో కొనసాగించాలని, తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచాలన్న ఉద్దేశంతోనే ఫైలుపై సంతకం పెట్టాను. ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన బిజినెస్ రూల్స్ వ్యవహారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధీనంలో ఉంటుంది.
కేటీఆర్ : ఫైల్ మూమెంట్‌కి చట్టపరంగా బాధ్యత వహించే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎందుకు నోటీసు ఇవ్వలేదు?
కేటీఆర్: సచివాలయ బిజినెస్ రూల్స్ అన్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధిలో ఉంటాయి. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వాన్నీ అడగవచ్చు.
కేటీఆర్ : ప్రభుత్వం పంపిన డబ్బులు మొత్తం ఫార్ములా-ఈ రేస్ కంపెనీకి చేరినప్పుడు అవినీతి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు.
కేటీఆర్ : ఎకడ డబ్బులున్నాయి అన్న విషయంలో స్పష్టత ఎఫ్ఐఆర్లోనే ఉన్నది. అలాంటప్పుడు డబ్బులకు సంబంధించి దుర్వినియోగం ఎక్కడ జరిగింది? నాపై చేస్తున్న అవినీతి ఆరోపణల్లో పస లేదు.
కేటీఆర్ : ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులే ప్రభుత్వ పనితీరు బిజినెస్ రూల్స్ గురించి చూసుకుంటారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ప్రశ్నించే హకు ఏసీబీకి ఉండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను నిర్వహించేందుకు అనేకసార్లు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆఫ్రో ఏషియన్ గేమ్స్ వంటి క్రీడలను నిర్వహించింది. క్యాబినెట్ ఆమోదం గురించి ఇలా ప్రశ్నిస్తున్నారే.. మరి క్యాబినెట్ ఆమోదం లేకుండా రేసు రద్దు చేసిన ముఖ్యమంత్రిని కూడా ఈ కేసులో బాధ్యులను చేయాల్సి వస్తుంది. రేసు రద్దు వల్ల జరిగిన నష్టానికి ముఖ్యమంత్రి పైన కూడా కేసు నమోదు చేయాలని నేను కోరుతున్నా.
కేటీఆర్ : మొదటి రేసు సందర్భంగా అర్బన్ ఏస్ సంస్థ పూర్తిగా ఫార్ములా ఈ తోనే కార్యకలాపాలు నిర్వహించింది. ప్రభుత్వ పరంగా కేవలం మౌలిక వసతులు మాత్రమే కల్పించే బాధ్యత తీసుకున్నాం. మొదటి రేస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఫార్ములా ఈకి, అర్బన్ ఏస్ సంస్థకు మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలూ జరగలేదు. ఆ ప్రైవేట్ సంస్థ ఆర్థిక వివరాలు నాకు తెలియదు. ఆ అంశం నా పరిధిలోకి రాదు.
కేటీఆర్ : మొత్తం వ్యవహారానికి సంబంధించి నేను మంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించిన ఉత్తర ప్రత్యుత్తరాలు, తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించండి. ఇక రేసు ఏర్పాటు, దాని నిర్వహణ వల్ల ప్రభుత్వానికి భారీగా లాభం జరిగిందే తప్ప ఎలాంటి నష్టం జరగలేదు.
కేటీఆర్ : ఈ మొత్తం ప్రక్రియలో చట్ట వ్యతిరేకమైన అంశం ఏదీలేదు. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి లోటుపాట్లు ఉంటే ప్రభుత్వ పరమైన విచారణ చేస్తే సరిపోతుంది. ఎక్కడా పైసా అవినీతి లేనప్పుడు.. ఇందులో చట్టవ్యతిరేకత ఎక్కడుంది? మీరు ఎన్ని గంటలైనా సరే నన్ను ఈ కార్యాలయంలో కూర్చోమన్నా కూర్చుంటాను. ఒకవేళ మీకు ప్రభుత్వం న న్ను అరెస్టు చేయాలని ఆదేశాలిస్తే.. ఈ ప్రశ్న లు అడగడం అనే వృథా ప్రయాస మానేసి ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసుకోవచ్చు. మీరు తిరిగి పదేపదే అవే ప్రశ్నలు అడిగితే నా సమాధానం కూడా అదే. మీకు కావా లంటే బ్రేక్ తీసుకోండి. కానీ అవే ప్రశ్నలు అడగడం వల్ల లాభం లేదు. ఊహాజనితంగా ప్రశ్నలు అడగడం వల్ల కేసు విచారణ ముందుకు పోదు.
కేటీఆర్ : రేసు కొనసాగించకపోవడం వల్లనే ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లింది. ఒప్పందం రద్దుచేసి ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎందుకు ఈ కేసులో భాగస్వామిగా చేర్చలేదో చెప్పండి. ఫార్ములా ఈ-రేస్‌కు సంబంధించిన పూర్తి ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ కూడా రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు నాకు ప్రభుత్వం కేటాయించిన అధికారిక ఈమెయిల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ అకౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉన్నది. మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వంలో భాగమైన నాకు ముమ్మాటికీ ఉన్నది.