పెద్దపల్లి : ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల ప్రాణాలనే బలిగొంటున్నది. గెలిచే వరకు ఎన్నో హామీలు ఇచ్చి తీరా ఎన్నికల్లో విజయం సాధించాక ప్రజలను నిలువునా మోసం చేసింది. దీంతో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా ఇందిరమ్మ ఇండ్ల (Indiramma house)జాబితాలో తన పేరు లేదని ఓ కార్మికుడు బలవన్మరణానికి(Worker commits suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన పురుషోత్తం ప్రభాకర్ అనే వ్యక్తి ఇందిరమ్మ జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభాకర్ మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యే.. మాకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Suryapeta | ఆర్నేళ్ల కింద ప్రేమ వివాహం.. యువకుడి దారుణ హత్య