KA Paul | మనల్ని ఎందుకు సీఎం చేయలేదు.. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోండి : కేఏ పాల్
KA Paul | కొండా సురేఖను బీసీ బిడ్డగా, మహిళగా నిన్ను ముఖ్యమంత్రిని చేయాలి.. మంత్రి పదవి నుంచి తీసేస్తున్నారు ఎందుకని అడిగితే.. నీ కూతురు ఎవరినో తిట్టిందట.మరి అలా అయితే జగ్గారెడ్డిని ఎందుకు తీయలేదని ప్రశ్నించారు.
KA Paul | కొండాసురేఖను కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్.. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించేస్తున్నారు.. ఈ కాంగ్రెస్ పార్టీలో ఇదే 5 శాతం ఉన్న రెడ్డిలకు 80 సంవత్సరాల్లో 12 మందిని ముఖ్యమంత్రులను చేసింది. మనం 50 శాతం బీసీలం ఉన్నాం. 27 శాతం కాపులమున్నాం. 90 శాతం బడుగు బలహీన వర్గాలం ఉన్నాం. మనల్ని ఒక్కసారైనా ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదు.. చేయరు.. చేయబోరన్నారు.
ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోండి.. అందుకే కొండాసురేఖను బీసీ బిడ్డగా, మహిళగా నిన్ను ముఖ్యమంత్రిని చేయాలి.. మంత్రి పదవి నుంచి తీసేస్తున్నారు ఎందుకని అడిగితే.. నీ కూతురు ఎవరినో తిట్టిందట. మరి అలా అయితే జగ్గారెడ్డి నువ్వు రూ.50 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యావని రేవంత్ రెడ్డిని తిట్టలేదా..? ఆయనను ఎందుకు తీయలేదని అని ప్రశ్నించారు.
కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి ఒకరినొకరు తిట్టుకోవడం లేదా..? వాళ్ల పదవులు పోవు.. కానీ ఒక మహిళ అయితే.. ఒక బీసీ అయితే.. ఒక కాపు అయితే వెంట్రుక కూడా పీకలేం.. ఎందుకు మన బీసీ కాపులకు బుద్ది లేక. పార్టీలు పెడతారు.. ప్యాకేజీ స్టార్లు అయి అమ్ముడుపోతారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోండి.. మనిషికో పార్టీ పెట్టకుండా.. ఇది గద్దరన్న పార్టీ.. బీజీపీ, కాంగ్రెస్‌తోపాటు అందరినీ కాదని ప్రజా శాంతి పార్టీలో చేరండి.. ప్రజలకు శాంతి రావాలంటే ప్రజా శాంతి పార్టీ కావాలి. అప్పులు తీరాలంటే అభివృద్ధి జరగాలంటే.. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రజాశాంతి పార్టీ ఒకటే మార్గమన్నారు.
కొండా సురేఖను తన పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్
మీకు ప్రజాశాంతి పార్టీ ఉంది వేరే పార్టీలోకి వెళ్లకండి
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నాయకుల పదవులకు ఎలాంటి డోకా ఉండదు, కేవలం బీసీ నాయకుల పదవులకే ప్రమాదం
బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రజాశాంతి పార్టీ ఒకటే మార్గం
– కేఏ పాల్ pic.twitter.com/UqMOe4omFk
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2026
Read Also :
Rashmika | భర్త విజయ్‌తో మూడు నెలల తర్వాత ఫుల్ క్వాలిటీ టైమ్.. నేచరే ఇలా చేసిందేమో ..
ACB | సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య నివాసంలో ఏసీబీ మెరుపు దాడులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

