ఒరాకిల్‌లో మళ్లీ లేఆఫ్ బాంబ్!.. 3 వేల మందిపై వేటుకు అవకాశం?
టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో మొదలైన తాజా ఉద్యోగాల కోత భారత్‌కు కూడా చేరింది. ఒరాకిల్ ఇండియాలో ఉద్యోగ తొలగింపులు ప్రారంభమయ్యాయని మనీకంట్రోల్ కథనం పేర్కొంది. ఈనెల 14న(సోమవారం) అమెరికాలో ఉద్యోగ తొలగింపులు ప్రారంభమై భారత్‌కు విస్తరించాయి.
- భారత్‌లోనూ మొదలైన లేఆఫ్‌లు
- ఉదయం 6 గంటలకే ఉద్యోగులకు తొలగింపు ఈ-మెయిల్స్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో మొదలైన తాజా ఉద్యోగాల కోత భారత్‌కు కూడా చేరింది. ఒరాకిల్ ఇండియాలో ఉద్యోగ తొలగింపులు ప్రారంభమయ్యాయని మనీకంట్రోల్ కథనం పేర్కొంది. ఈనెల 14న(సోమవారం) అమెరికాలో ఉద్యోగ తొలగింపులు ప్రారంభమై భారత్‌కు విస్తరించాయి. ఈ కోతలలో ప్రాడక్ట్ ఇంజనీరింగ్ విభాగం అధిక వాటాను చవిచూడగా సపోర్ట్, కన్సల్టింగ్ విభాగాలపై ప్రభావం కొంత తక్కువగా ఉంది. ఈ విస్తృత ప్రపంచ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్(ఓఎఫ్ఎస్ఎస్)లోని కొంతమంది సీనియర్ ఉద్యోగులు కూడా ప్రభావితమైనట్టు సమాచారం.
దేశంలో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దేశంలో సుమారు 3,000 మంది ఉద్యోగులు ప్రభావితం కావచ్చని గత అంచనాలు సూచించగా అంతర్గత అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7,000 నుంచి 10,000 మరకు ఉద్యోగాల కోత ఉండవవ్చని తెలుస్తున్నది. మంగళవారం నాటికి ఒరాకిల్ ప్రపంచవ్యాప్త ఉద్యోగుల సంఖ్య సుమారు 5,000 నుంచి 6,000 వరకు తగ్గి ఉంటుందని అంచనా. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ, మరిన్ని తొలగింపు నోటీసులు జారీ అయ్యే కొద్దీ దీని తుది సంఖ్యలో మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉండవచ్చని దేశంలోని ఉద్యోగుల మధ్య జరుగుతున్న చర్చలు సూచిస్తున్నాయి.
పెండ్లికి ముందు పోయిన ఉద్యోగం
కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ ఒరాకిల్ ఎట్టకేలకు మరింత మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ధృవీకరించింది. అయితే ఈ తాజా విడతలో ఎంతమంది ప్రభావితమయ్యారనే సంఖ్యను మాత్రం స్పష్టం చేయలేదు. ప్రభావిత ఉద్యోగులకు సోమవారం(సెప్టెంబర్ 14) ఉదయం సుమారు 6 గంటలకు ఈమెయిల్స్ అందినట్లు సమాచారం. అధికారిక నోటిఫికేషన్ అందకముందే కొంతమంది ఉద్యోగులు ఒరాకిల్ సిస్టమ్‌లకు తమ యాక్సెస్‌ను కోల్పోయినట్టు కూడా తెలిసింది. సంస్థ చేపట్టిన విస్తృతమైన సంస్థాగత మార్పులలో భాగంగా తమ ఉద్యోగ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు, అలాగే ఈమెయిల్ అందిన రోజే తమ చివరి పని దినం అవుతుందని కంపెనీ సమాచారం అందించినట్టు తెలిసింది. జరిగిన పరిణామాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో చాలా మంది ఉద్యోగులు ఇంకా ఉన్నప్పటికీ ఆ షాకింగ్ అనుభవాన్ని మరికొందరు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
తన పెండ్లికి కేవలం 11 రోజుల ముందే ఒక ఒరాకిల్ ఉద్యోగి తొలగింపు మెయిల్ అందుకున్నారు. నా పెండ్లికి 11 రోజులు ముందు ఉద్యోగం పోయింది. నాలుగైదు ఏండ్లు పనిచేశాక, చివరికి ఈసారి తొలగింపు వేటుకు గురయ్యాను అని ఆ ఉద్యోగి రెడిట్‌లో రాశారు. ఈ నిర్ణయం పైస్థాయి నుంచే వస్తుందని, తన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో వారికి తెలియదని ఆయన పేర్కొన్నారు. కానీ ఆ సమయం(టైమింగ్) మాత్రం విచిత్రం. నిజానికి నాకు ఊరటగానే అనిపిస్తున్నది. నేను వేరే ఉద్యోగం లేదా కెరీర్ వైపు అడుగులు వేయాలని అనుకుంటున్నాను.
బహుశా ప్రపంచానికి మేలు చేసే ఏదైనా సంస్థలో పని చేయవచ్చు అని ఆ వ్యక్తి పేర్కొన్నారు. నిద్రలేచి చూసేసరికి తమ ఒరాకిల్ సిస్టమ్స్‌కు యాక్సెస్ లాక్ చేయబడి ఉన్నట్టు రెడిట్‌లో మరో ఉద్యోగి రాశారు. ఆ తర్వాత తమను ఉద్యోగం నుంచి తొలగించినట్టు ఈమెయిల్ వచ్చిందని ఆ వ్యక్తి తెలిపారు. ఫ్రెషర్‌గా చేరినప్పటి నుంచి ఎలాంటి ప్రమోషన్ సైకిల్స్ లేకపోవడంతో రెండేండ్ల అనుభవంతో నేను దాదాపుగా ఇంకా జూనియర్ డెవలపర్గానే కొనసాగుతున్నాను. నా జీతం కూడా తక్కువగానే ఉండేది. అంతేగాకుండా నా మేనేజర్ నుంచి నాకు ఎప్పుడూ తక్కువ రేటింగ్ రాలేదు అని ఆ ఉద్యోగి రాశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

