హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేశ్‌పై ము సుగులు ధరించిన వ్యక్తులు సోమవారం దాడికి యత్నించిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. విచారణ పేరుతో పండుగ రోజున పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, సు మారు 15మంది ముసుగులు ధరించిన పోలీసులు ఇంటరాగేషన్ రూమ్‌లోకి వెళ్లి దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. లీగల్ టీమ్ అడ్డుకోవడంతో వారు వెనుదిరిగారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేసి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
పోలీస్ కస్టడీలోనే దాడి: రవిచంద్ర
మహేశ్, మహేందర్రెడ్డిలను విచారణ పేరుతో సైఫాబాద్ స్టేషన్‌కు పిలిపించి ముసుగు ధరించిన వ్యక్తులు దాడికి ప్రయత్నించడం దుర్మార్గమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తంచేశారు. పూర్తి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముసుగు ధరించిన వ్యక్తులు స్టేషన్లోకి ఎలా ప్రవేశించారన్నది తేలాల్సి ఉన్నదని చెప్పారు. స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలు, డీవీఆర్ రికార్డులను భద్రపరిచి ఫోరెన్సిక్ పరిశీలనకు అప్పగించాలని, బాధితులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
దాడి చేస్తుంటే ఏం చేశారు?: తలసాని
పండుగ రోజున విచారణ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, అకడే దా డి చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. స్టేషన్లోనే దాడి జరుగుతుంటే పోలీసు లు ఏం చేస్తున్నారో? ప్రభుత్వం స మాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరారు.
ఎమర్జెన్సీని తలపిస్తున్నది : జగదీశ్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి పాలన ఎమర్జెన్సీని త లపిస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘పోలీస్‌స్టేషన్‌లోనే దాడి జరుగడం దారుణం. దీని వెనుక ఎవరి కుట్ర ఉన్నదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
సీఎం సమాధానం చెప్పాలి : వేముల
వినాయక చవితి రోజున విచారణకు పిలిపించడం, అనంతరం దాడికి యత్నం జరుగడంపై అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. పోలీసుల సమక్షంలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి ముసుగు ధరించిన వ్యక్తులను గుర్తించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఘటనపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విచారణ చేపట్టాలి: దేశపతి
ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఉన్నాయని పండుగ రోజున విచారణ పేరుతో స్టేషన్‌కు పిలిపించడం సరికాదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్‌లోకి ముసుగు ధరించిన వ్యక్తులు ఎలా వచ్చారో తేల్చేందుకు నిష్పాక్షిక విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది ప్రభుత్వ ప్రేరేపిత అరాచకం: దాసోజు
ఈ దాడి ఘటనను ప్రభుత్వ ప్రేరి త అరాచకంగా ఎమ్మెల్సీ దాసోజు శ్ర వణ్ అభివర్ణించారు. దాడికి పాల్పడి న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కుట్రకోణాన్ని వెలికితీయాలి : పల్లా
సైఫాబాద్ ఘటనపై జనగామ ఎ మ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి వెనుక ఉన్న కుట్ర కోణాన్ని సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ, బాధితులకు భద్రత, వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు.