శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది. ‘సామజవరగమన’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత శ్రీవిష్ణు-రామ్ అబ్బరాజు కాంబోలో వస్తున్న సినిమా ఇది కావడం విశేషం. సోమవారం ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
డబ్బు చుట్టూ నడిచే ఈ కథలో కావాల్సినంత వినోదం ఉంటుందని, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయని మేకర్స్ తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. సాక్షి మథోల్కర్, నరేష్ వీకే, అభిరామి, మురళీశర్మ, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జె.యువరాజ్, సంగీతం: చైతన్ భరద్వాజ్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.