Allari Naresh | అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’పై ఫుల్ కాన్ఫిడెన్స్.. ముందే సక్సెస్ మీట్ అనౌన్స్ చేసిన అల్లరోడు
Allari Naresh | కామెడీ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్ . గత కొన్నేళ్లుగా వైవిధ్యమైన, సీరియస్ కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. దీంతో ఆయన నుంచి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలమే అయింది. ఇప్పుడు తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జానర్లో ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
Allari Naresh | కామెడీ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్ . గత కొన్నేళ్లుగా వైవిధ్యమైన, సీరియస్ కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. దీంతో ఆయన నుంచి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలమే అయింది. ఇప్పుడు తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జానర్లో ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అల్లరి నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అల్లరి నరేష్ కెరీర్లో ‘నాంది’ సినిమా తర్వాత వచ్చిన సోలో సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి.
‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘ఉగ్రం’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘బచ్చల మల్లి’, ‘12A రైల్వే కాలనీ’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి.ఈ నేపథ్యంలో ‘రంభ ఊర్వశి మేనక’పై అల్లరి నరేష్ భారీ నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందని ప్రీ-రిలీజ్ వేడుకలో ధీమా వ్యక్తం చేశారు.సినిమా విజయంపై అల్లరి నరేష్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో ఆయన మాటల్లోనే స్పష్టంగా కనిపించింది. “సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 9న సక్సెస్ మీట్ ఉంటుంది. ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలి. డెఫినెట్‌గా సక్సెస్ మీట్లో మాట్లాడతాను. ఈసారి కొడుతున్నాం.. సక్సెస్ మీట్ పెడుతున్నాం.. మాట్లాడుతున్నాం.. అంతే” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
దీంతో సినిమా కంటెంట్‌పై నరేష్‌కు ఎంత నమ్మకం ఉందో అభిమానులు, సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.ప్రీ-రిలీజ్ ఈవెంట్లో అక్కినేని నాగార్జునతో తనకున్న అనుబంధాన్ని కూడా అల్లరి నరేష్ గుర్తు చేసుకున్నారు. “చిన్నప్పటి నుంచి అక్కినేని నాగార్జున గారికి నేను ఫ్యాన్‌ని. ఆయనతో కోస్టార్‌గా ‘నా సామిరంగా’ సినిమా చేశాను. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో హీరోగా సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది”అని తెలిపారు.అలాగే నిర్మాత నిమ్మకాయల ప్రసాద్‌తో ‘అల్లరి’ సినిమా నుంచే తనకు పరిచయం ఉందని చెప్పారు. కథల విషయంలో తాను డైలమాలో ఉన్నప్పుడు ఆయన సలహాలు తీసుకుంటానని వెల్లడించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన చంద్ర మోహన్ చింతాడ కోసం సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు అల్లరి నరేష్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

