Road accident | అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థిని మృతి, మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు
అర్ధరాత్రి సమయంలో హాస్టల్ నుండి బయటకు వెళ్లిన విద్యార్థులకు ఊహించని ప్రమాదం జరగ్గా.. ఓ విద్యార్థిని అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
Road accident | తిమ్మాపూర్, సెప్టెంబర్17: అర్ధరాత్రి సమయంలో హాస్టల్ నుండి బయటకు వెళ్లిన విద్యార్థులకు ఊహించని ప్రమాదం జరగ్గా.. ఓ విద్యార్థిని అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం.. కరీనంగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులు రాత్రి 12 గంటల సమయంలో శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని ఒక బేకరీకి వెళ్లి, తిరిగి హాస్టల్ కు వస్తున్నారు. ఈ క్రమంలో వారు హాస్టల్‌కు తిరిగి వస్తుండగా గుర్తుతెలియని కారు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో విద్యార్థిని అక్కడిక్కడే మృతి చెందింది.
అదే సమయంలో అటుగా ఫ్యామిలీతో వెళ్తున్న ఓ కారు యజమాని విద్యార్థులను చూసి చల్లించి తన కారులో కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలు సిరిసిల్లకు చెందిన భవానిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో మృతురాలితో పాటు మరో ముగ్గురు ఉండగా, వారితో ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
Mission bhagiratha water | అధికారులూ 4 రోజులవుతుంది పట్టించుకోరా..? వృథాగా పోతున్న మిషన్‌భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

