అమెరికాలో ‘లిటిల్ ఇండియా’ల జోరు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాలు, వాణిజ్యం, గ్రీన్‌కార్డులపై ఆంక్షలు విధించినప్పటికీ భారతీయుల అమెరికా కల చెదిరిపోలేదు. అమెరికాలో విస్తరిస్తున్న ‘లిటిల్ ఇండియా’లే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. 2005లో అమెరికాలో 18 లక్షలుగా ఉన్న భారతీయుల సంఖ్య 2025 నాటికి 50 లక్షలకు చేరింది. ఓ నివేదిక ప్రకారం తెల్లజాతి అమెరికన్ల కంటే భారతీయ కుటుంబాల సంపద రెట్టింపుగా ఉంది.
- రాబోయే ఐదేండ్లలో 75కు చేరిక
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాలు, వాణిజ్యం, గ్రీన్‌కార్డులపై ఆంక్షలు విధించినప్పటికీ భారతీయుల అమెరికా కల చెదిరిపోలేదు. అమెరికాలో విస్తరిస్తున్న ‘లిటిల్ ఇండియా’లే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. 2005లో అమెరికాలో 18 లక్షలుగా ఉన్న భారతీయుల సంఖ్య 2025 నాటికి 50 లక్షలకు చేరింది. ఓ నివేదిక ప్రకారం తెల్లజాతి అమెరికన్ల కంటే భారతీయ కుటుంబాల సంపద రెట్టింపుగా ఉంది. గత 20 ఏండ్లలో అమెరికాలో భారతీయుల జనాభా గణనీయంగా ఉన్న 50కి పైగా ‘లిటిల్ ఇండియా’లు ఏర్పడ్డాయి. వచ్చే ఐదేండ్లలో ఈ సంఖ్య 75కు చేరుకునే అవకాశం ఉంది.
భారతీయ కుటుంబాల సగటు ఆదాయం సుమారు రూ.1.54 కోట్లు కాగా, తెల్లజాతి అమెరికన్ కుటుంబాల సగటు ఆదాయం దాదాపు రూ.80 లక్షలుగా ఉంది. ఈ ఆదాయ అంతరం రాబోయే ఏండ్లలో మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. కరోలినా, కాలిఫోర్నియా, న్యూజెర్సీల్లో మొత్తంగా 50 ‘లిటిల్ ఇండియా’లు ఉన్నాయి. మరో 25 లిటిల్ ఇండియాలు జార్జియా, అరిజోనా, వర్జీనియా, సియాటిల్, షికాగోలో ఏర్పడే అవకాశం ఉంది. భారతీయుల ఉనికి అమెరికా ఆర్థిక నమూనాతో నేరుగా ముడిపడి ఉందని బ్రూకింగ్ ఇన్స్టిట్యూషన్కు చెందిన విలియం ఫ్రే పేర్కొన్నారు. భారతీయులు 25 ఏండ్ల క్రితం సిలికాన్ వ్యాలీలో తమ ప్రయాణాన్ని ప్రారంభించారని, ప్రస్తుతం టెక్నాలజీ కేంద్రానికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

