RS Praveenkumar | కళ్యాణ లక్ష్మి పథకం ఆపడానికి కుట్ర జరుగుతుంటే నెల రోజులు కోర్టు టైం ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు కౌంటర్ వేయలేదు..? అని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు కొత్తగా విజయ్ గోపాల్ అనే కార్యకర్త, అడ్వకేట్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) జులై 8న వేసిండు. నిజంగా పిల్ వేయగానే మొట్టమొదట ఆయన పిటిషన్ లిస్ట్ అయిన వెంటనే ముందు గవర్నమెంట్ ప్లీడర్లకు నోటీసులు పోతయి. ఆయన ప్రతివాదులుగా ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్పేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ మైనార్టీ వెల్పేర్ను పేర్కొన్నాడు.
పిటిషన్ లిస్ట్ అయిన వెంటనే మొదట ఈ నలుగురికి నోటీసు పోతది. విజయ్ గోపాల్ అనే అడ్వకేట్ ఇది రాజ్యాంగ విరుద్దం. ఈ రాజ్యాంగంలో ఉండే అధికరణలకు విరుద్దంగా ఉన్నది. మరి సామాజిక న్యాయానికి, సమానత్వానికి విరుద్దంగా ఉందని ఆయన అంటున్నడు. జీవోల ప్రకారం సంక్షేమ పథకాలు నడపడం కాదు.. దీనికి చట్టబద్దత ఉండాలి. అని ఆయన అంటున్నాడు. మీ స్పందన ఏంటి అని ఆ రోజు (జులై 8న)నోటీసులు జారీ చేశారు. అడ్మిషన్ అయిపోయింది. జూలై 8వ తేదీ నుంచి 4 సార్లు విచారణ వాయిదా పడినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు..? అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లకు నోడల్ ఏజెన్సీ పొన్నం ప్రభాకర్.. ఆయన మేము మాట్లాడితే మమ్మల్ని తాడు బొంగరం లేనోళ్లు అని అంటాడు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మాటలకు, ఇతర సంక్షేమ శాఖ మంత్రుల మాటలకు తాడు బొంగరం ఉందా..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిగారు.
కళ్యాణ లక్ష్మి పథకం ఆపడానికి కుట్ర జరుగుతుంటే నెల రోజులు కోర్టు టైం ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు కౌంటర్ వేయలేదు?
జూలై 8వ తేదీ నుంచి 4 సార్లు విచారణ వాయిదా పడినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు?
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లకు నోడల్ ఏజెన్సీ పొన్నం ప్రభాకర్.. ఆయన… https://t.co/urIq9p5LSK pic.twitter.com/IVRz8G6fX6
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026
Sukumar | సుకుమార్ కూతురు అరుదైన ఘనత.. సింగర్స్ విభాగంలో ఏకైక విద్యార్థిని!
Earth Quake | లడఖ్‌లో గంటల వ్యవధిలో రెండు భూప్రకంపనలు