ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్ లోపాలు సరి చేసుకోవడం గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు మాంసం, గుడ్లు తినాలనే సలహాలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. మరి శాకాహారుల సంగతేమిటి? అని కొందరు అడుగుతారు. మాంసంలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. నిజమే కానీ, ప్రొటీన్ కోసం మాంసమే తినాలని లేదు. శాకాహారాల్లోనూ మాంసంలో ఉన్నంత ప్రొటీన్ ఉంటుంది. ప్రతి భోజనంలో ఈ ఏడింటిలో ఏదో ఒకటి ఉండేలా చూసుకుంటే ప్రొటీన్లోపమే రాదని కొందరు సూచిస్తున్నారు.
పప్పులు, సోయా ఉత్పత్తులు, తృణ ధాన్యాలు, గింజలు (బాదం, వాల్నట్, పల్లీలు, చియా, అవిసె, పొద్దుతిరుగుడు, గుమ్మడి), ఆకు కూరలు (పాలకూర, మెంతికూర, ఆవాల ఆకులు), పాల ఉత్పత్తులు, పండ్లు-కూరగాయలు ఇవి తింటే మాంసంలో ఉండే ప్రొటీన్ మీ సొంతం. అంతేకాదు మాంసాహారంలో అధికంగా ఉండే విటమిన్ బి12, ఫోలేట్స్ ఇతర పోషకాలు కూడా వీటి నుంచి లభిస్తాయి. కాబట్టి ప్రొటీన్ లోపంతోపాటు పోషకాహార లోపం సమస్య కూడా తీరిపోతుంది.