హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో సామాన్యులకే కాదు, ప్రజాప్రతినిధులకు కూడా కనీస గౌరవం దక్కడం లేదు. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి( MLA Megha Reddy) సెక్రటేరియట్లో(Secretariat) చేదు అనుభవం ఎదురైంది. 6వ అంతస్తులో సీఎస్ శాంతి కుమారి వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సీఎస్ శాంతి కుమారి వస్తున్నారు, పక్కకు నిలబడండి అంటూ పోలీసులు ఎమ్మెల్యేకు సూచించారు.
నేను ఎమ్మెల్యేను అని చెప్పినా వినకుండా.. మాకు ఆదేశాలు వచ్చాయంటూ మేఘారెడ్డిని పోలీసులు పక్కకు నిలబెట్టారు. దీంతో అసహనానికి గురైన మేఘారెడ్డి సీఎస్ వస్తే ఫ్లోర్ అంతా ఎవ్వరూ ఉండకూడదా? అని ప్రశ్నించారు. కాగా, ఎస్పీఎఫ్ సిబ్బంది ఎమ్మెల్యేలను గుర్తు పట్టడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి..
Jharkhand | బీజేపీ ఆశలు గల్లంతు.. జార్ఖండ్ పీఠం హేమంత్‌దే
Ajit Pawar | అబ్బాయ్ ఆశలు ఆవిరి..! బాబాయ్‌కి మళ్లీ పెద్ద పోస్టే వరించేనా..?