Maharashtra Elections | మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Maharashtra Elections) వెలువడుతున్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ మరఠ్వాడాలో బీజేపీ గెలుపు దిశగా ముందంజలో కొనసాగుతోంది. ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. 200కిపైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.
ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. మహాయుతి (Mahayuti) కూటమి 217 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ (Maha Vikas Aghadi) కూటమి కేవలం 55 స్థానాల్లోనే ముందంజలో కొనసాగుతోంది. ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 స్థానాలు గెలుపొందాల్సి ఉంటుంది. ఈ లెక్కన మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలకు మించి ఆధిక్యంలో ఉంది. ఇక్కడ మరోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా తెలుస్తోంది.
Also Read..
Priyanka Gandhi | అన్న రికార్డు బద్దలు కొట్టేనా.. వయనాడ్‌లో తిరుగులేని మెజార్టీ దిశగా ప్రియాంక
Jharkhand | జార్ఖండ్‌లో హోరాహోరీ.. రెండు కూటముల మధ్య దోబూచులాడుతున్న ఆధిక్యం
Maharashtra CM | మహాయుతి – ఎంవీఏ మధ్య హోరాహోరీ పోరు..! మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు..?