Jharkhand | జార్ఖండ్‌లో హోరాహోరీ.. రెండు కూటముల మధ్య దోబూచులాడుతున్న ఆధిక్యం
జార్ఖండ్‌లో (Jharkhand) జేఎంఎం, ఎన్డీయే కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ఇరు పక్షాల మధ్య ఆధిక్యం మారుతూవస్తున్నది. ఎర్లీ ట్రెండ్స్‌లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 38 సీట్లలో లీడ్‌లో ఉన్నది.
రాంచీ: జార్ఖండ్‌లో (Jharkhand) జేఎంఎం, ఎన్డీయే కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ఇరు పక్షాల మధ్య ఆధిక్యం మారుతూవస్తున్నది. ఎర్లీ ట్రెండ్స్‌లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 38 చోట్ల లీడ్‌లో ఉన్నది. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ మార్క్ 41 సీట్లు దాటాల్సి ఉంది.
రాష్ట్రంలో ప్రస్తుతం జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలో ఉన్నది. ప్రస్తత ఎన్నికల్లో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేయగా, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి.. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి(రామ్ విలాస్) పార్టీ ఒక చోట పోటీ చేశాయి. ఎన్డీఏ కూటమి 42 నుంచి 48 స్థానాల్లో, జేఎంఎం 25 -30 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన సంగతి తెలిసిందే.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయ్యే అవకాశం ఉందని జార్ఖండ్ ముక్తి మోర్చా జనరల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి సుప్రీయో భట్టాచార్య పేర్కొన్నారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, ఎన్డీఏ కూటమికి ప్రజలు వ్యతిరేక తీర్పు ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. సీఎం హేమంత్ సోరెన్ కూడా తమ పార్టీ గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. తప్పకుండా అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు హేమంత్ సోరెన్.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

