Maharashtra CM | ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మహాయుతి – మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం మహాయుతి(ఎన్డీఏ కూటమి) ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎంవీఏ కూడా మహాయుతికి గట్టిగానే పోటీనిస్తుంది. ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండడంతో బీజేపీ శ్రేణులు సంబురాలకు సిద్ధమయ్యారు. మేమంటే మేం అధికారం చేపడుతామని అటు మహాయుతి, ఇటు ఎంవీఏ కూటమి విశ్వాసంతో ఉన్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై చర్చ కొనసాగుతోంది.
ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఉన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిస్తే.. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బీజేపీ నాయకుడు ప్రవీణ్ దారేకర్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. అజిత్ పవార్ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఎన్సీపీ నాయకుడు అమోల్ మిట్కారి అజిత్ పవార్ సీఎం అవ్వాలనే కోరిక ఉందన్నారు.
ఇక మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోల్ మాట్లాడుతూ.. ఎంవీఏ కూటమిలో భాగంగా కాంగ్రెస్‌కే సీఎం పదవి ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నందున.. తాము ముఖ్యమంత్రి పోస్టుకు అర్హులమన్నారు. నానా పటోల్ వ్యాఖ్యలతో శివసేన(యూబీటీ) లీడర్ సంజయ్ రౌత్ విబేధించారు. ఒక వేళ పటోల్‌ను సీఎంగా ఎంపిక చేయాలనుకుంటే.. మల్లికార్జున్ ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ ప్రకటన చేయాల్సి ఉంటుంది. పటోల్ చేసిన వ్యాఖ్యలను తాము పరిగణనలోకి తీసుకోమని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Champai Soren | జార్ఖండ్‌లో ముమ్మాటికి గెలిచేది బీజేపీయే: చంపయీ సోరెన్
Maharashtra Elections | మహారాష్ట్రలో వీస్తున్న కమలం గాలి.. మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన బీజేపీ కూటమి
Priyanka gandhi | వయనాడ్‌లో భారీ ఆధిక్యంలో ప్రియాంక గాంధీ..