ముంబై: ఎగ్జిట్ పోల్ ఫలితాలే నిజమయ్యేలా ఉన్నాయి. మరఠ్వాడాలో మరోసారి బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేలా ఉంది. కమలం పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 147 స్థానాల్లో లీడ్‌లో ఉన్నది. ఇక ఎవీఏ కూటమి 84 స్థానాల్లో ముందంజలో ఉన్నది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 స్థానాలు గెలుపొందాల్సి ఉంటుంది.
కొలాబా స్థానంలో బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్, బారామతిలో అజిత్ పవార్, వర్లిలో శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కోప్రిలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిండే ఆధిక్యంలో ఉండగా, వాండ్రే ఈస్ట్‌లో బాబా సిద్దిఖీ కుమారుడు జిశాన్ సిద్దిఖీ (ఎన్సీపీ), ఇస్లాంపూర్‌లో ఎన్సీపీ ఎస్పీ అభ్యర్థి జయంత్ పాటిల్, ఔరంగాబాద్ ఈస్ట్‌లో ఎంఐఎం అభ్యర్థి ఇంజియాజ్ జలీల్ లీడ్‌లో ఉన్నారు.