Ajit Pawar | ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మహాయుతి మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. 196 స్థానాల్లో మహాయుతి లీడింగ్‌లో ఉంది. ఇక సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గంలో కుటుంబ పోరు కొనసాగుతూనే ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేశారు. కానీ సునేత్ర పవార్ ఓటమి పాలయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అజిత్ పవార్‌పై ఆయన సోదరుడు శ్రీనివాస్ పవార్ కుమారుడు యుగేంద్ర పవార్ పోటీ చేశారు. మొదట్లో యుగేంద్ర పవార్ ఆధిక్యంలో కొననసాగినప్పటికీ.. బాబాయ్ అజిత్ తర్వాత ఆధిక్యంలోకి వచ్చారు. బాబాయ్‌పై గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలనుకున్న యుగేంద్ర పవార్ ఆశలు ఆవిరి అయ్యాయనే చెప్పొచ్చు. ఈ ఎన్నికలో అజిత్ పవార్ గెలిస్తే.. బారామతి నుంచి వరుసగా ఎనిమిది సార్లు గెలిచిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు.
మహారాష్ట్రలో మహాయుతి అధికారంలోకి వస్తే.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న అజిత్ పవార్.. మళ్లీ కీలక పదవి లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అజిత్ పవార్‌కు సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయని ఎన్సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కంగ్రాట్స్ అజిత్ పవార్ అంటూ బారామతి నియోజకవర్గంలో ఇప్పటికే పోస్టర్లు వెలిశాయి.
ఇవి కూడా చదవండి..
Priyanka Gandhi | అన్న రికార్డు బద్దలు కొట్టేనా.. వయనాడ్‌లో తిరుగులేని మెజార్టీ దిశగా ప్రియాంక
Maharashtra CM | మహాయుతి – ఎంవీఏ మధ్య హోరాహోరీ పోరు..! మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు..?
Warm Water In Winter | చలికాలంలో రోజూ గోరు వెచ్చని నీటిని తాగడం మరిచిపోకండి..!