Warm Water In Winter | చలికాలంలో సహజంగానే అందరూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే చలికాలంలో చాలా మంది గోరు వెచ్చని నీటిని తాగరు. గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీళ్లను లేదా చల్లని నీటిని తాగుతుంటారు. కానీ వాస్తవానికి ఇతర సీజన్లలో గోరు వెచ్చని నీటిని తాగకపోయినా చలికాలంలో మాత్రం కచ్చితంగా గోరు వెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది. చలికాలంలో గోరు వెచ్చని నీటిని రోజు మొత్తం తాగాల్సి ఉంటుంది. అప్పుడే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గోరు వెచ్చని నీటిని ఈ సీజన్లో తాగడం వల్ల పలు వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇంకా అనేక లాభాలు కలుగుతాయి.
ఈ సీజన్లో మన జీర్ణ శక్తి సహజంగానే తగ్గుతుంది. చలికాలంలో శరీరం తనకు తాను వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. కనుక జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అయితే ఈ సీజన్లో గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియను మెరుగు పరుచుకోవచ్చు. చలికాలంలో గోరు వెచ్చని నీటిని సేవించడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో చాలా మందిని మలబద్దకం ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అలాంటి వారు గోరు వెచ్చని నీటిని తాగితే జీర్ణ వ్యవస్థలోని వ్యర్థాలు సులభంగా బయటకు వస్తాయి. సుఖ విరేచనం అవుతుంది. దీంతో మలబద్దకం నుంచి ఉపశమనం పొందవచ్చు. కనుక ఈ సీజన్లో కచ్చితంగా గోరు వెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది.
ఈ సీజన్లో ఉదయం గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. కిడ్నీలు క్లీన్ అవుతాయి. కిడ్నీ స్టోన్లు రాకుండా చూసుకోవచ్చు. శరీరంలోని వ్యర్థాలు అన్నీ మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. కనుక చలికాలంలో గోరు వెచ్చని నీటిని కచ్చితంగా తాగాల్సి ఉంటుంది. ఇక ఈ సీజన్లో అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టం అవుతుంది. చెమట అంత త్వరగా రాదు. అయితే గోరు వెచ్చని నీటిని సేవించడం వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. గోరు వెచ్చని నీటిని తాగితే శరీర మెబాటిజం పెరుగుతుంది. దీని వల్ల క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు ఉన్నవారు త్వరగా తగ్గుతారు. కనుక గోరు వెచ్చని నీటిని రోజూ తాగే ప్రయత్నం చేయండి.
చలికాలంలో మన ముక్కులో, ఊపిరితిత్తుల్లో శ్లేష్మం పేరుకుపోతుంది. దీంతో ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. ముక్కులో, ఊపిరితిత్తుల్లో ఉండే శ్లేష్మం కరిగిపోతుంది. దీని వల్ల దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా హెర్బల్ టీలను సేవించడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. హెర్బల్ టీలను తయారుచేసి గోరువెచ్చగా సేవిస్తే శ్లేష్మం ఇంకా త్వరగా కరిగిపోతుంది. దీంతో శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ సీజన్లో చాలా మందికి ఒళ్లు బద్దకంగా ఉంటుంది. శరీరం నిండా నొప్పులుగా అనిపిస్తుంది. ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు ఉంటాయి. అయితే అలాంటి వారు గోరు వెచ్చని నీటిని తాగితే ఫలితం ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో మన చర్మం పగులుతుంది. దీంతో చాలా మంది క్రీములు గట్రా రాస్తుంటారు. కానీ గోరు వెచ్చని నీటిని తాగితే చాలు, చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. ఎలాంటి క్రీములను రాయాల్సిన పనిలేదు. ఇలా చలికాలంలో గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.