BC Population | జనగామ రూరల్, ఫిబ్రవరి 07 : రాష్ట్రంలో బీసీలను తగ్గించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వేను చేపట్టిందని పెంబర్తి విశ్వకర్మ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు అయిలా సోమ బ్రహ్మచారి మండిపడ్డారు. బీసీలను తగ్గించే విధంగా సర్వే చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి సర్వేలను జీవితంలో ఎప్పుడు చూడలేదని పేర్కొన్నారు. రోజురోజుకు జనాభా పెరుగుతుందే తప్ప ఎక్కడ కూడా తగ్గలేదని కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జనాభాను తగ్గించి ఓసీ జనాభాను పెంచిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అనేక రకాల కులాలు ఉండగా ప్రభుత్వం చెబుతున్న లెక్కలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఇప్పుడు బీసీల సంఖ్యను తక్కువగా చూపించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ శాతాన్ని కూడా తగ్గించే అవకాశం ఉందని, దీనివల్ల బీసీల ప్రజాప్రతినిధుల సంఖ్యను తగ్గించే అవకాశం ఖాయమన్నారు. బీసీలు మేల్కొని మన హక్కును కాపాడుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్ర సర్వేను చేపట్టి బీసీల రిజర్వేషన్లను అమలు చేయాలని సోమ బ్రహ్మచారి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
BC Reservations | రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మంది బీసీ నామినేషన్లు..!
Suicide | ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమ వ్యవహారం.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు