Suicide | జోగులాంబ గద్వాల్ : ఓ యువకుడు ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడ్డాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. కానీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది.
గద్వాల పట్టణంలోని చింతలపేటకు చెందిన నవీన్(25).. గత కొంతకాలం నుంచి ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెతో విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక చేసేదేమీ లేక ఆ యువకుడు రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. తమ కుమారుడి ఆత్మహత్యపై పలు అనుమానాలు ఉన్నాయని తల్లి శకుంతలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
MLC Teenmar Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు
Medigadda | ఎడారిగా మారిన మేడిగడ్డ.. పర్యాటకుల ఆవేదన