Vijay Devarakonda | హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికుల ఆందోళన చెందుతున్నారు. ఈ విమానంలో టాలీవుడ్ విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు.
నటుడు విజయ్ దేవరకొండ ఈరోజు ఉదయం తన అమ్మతో కలిసి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళకి బయలుదేరిన విషయం తెలిసిందే. ఎయిర్పోర్ట్ నుంచి వీరిద్దరి వెళుతున్న వీడియోలు ఇప్పటికే వైరల్‌గా మారాయి. అయితే ఉదయం 9 గంటలకు బయలదేరాల్సిన స్పైస్ జెట్ విమానం ఇంకా బయలుదేరకపోవడంతో విజయ్‌తో పాటు అందులో ఉన్న ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. స్పెషల్ ఫ్లైట్ అని చెప్పి ఒక టికెట్‌కి రూ.30000 తీసుకుంటున్నా ఇంత ఆలస్యం ఏంటి అసహనం వ్యక్తం చేశారు.