Medigadda | మహాదేవపూర్, ఫిబ్రవరి 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల పరిధిలోని అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజికి పర్యాటకుల తాకిడి పెరిగింది. శుక్రవారం హైదరాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు మేడిగడ్డ బ్యారేజి చూసేందుకు వచ్చారు. బ్యారేజ్‌లో నీరు లేక ఎడారిని తలపిస్తున్నటువంటి దృశ్యాలను చూసి పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేశారు.
నాడు కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ ప్రజానికానికి ఎంతో మేలు చేసే విధంగా నిర్మించిన మేడిగడ్డ ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యంతో నీరు లేక ఎడారిగా మారిందని, మళ్లా కేసీఆర్ గెలిచి ఉంటే బ్యారేజీ బాగుపడేదని ప్రజలకు, రైతులకు మేలు జరిగేదని అభిప్రాయపడ్డారు. గతంలో నిండుకుండను తలపించిన బ్యారేజీ ప్రస్తుతం నీరు లేక ఎడారిగా మారిన దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. మేడిగడ్డకు పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలన్నారు. కేసీఆర్ ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని పర్యాటకులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Bayyaram | బయ్యారం మార్కెట్ చెక్‌పోస్టులో ఆకస్మిక తనిఖీలు..
Murder | ఛత్తీస్‌గఢ్‌లో సర్పంచ్ అభ్యర్థిని హత్య చేసిన మావోయిస్టులు..!
Jangaon Collectorate | జనగామ కలెక్టరేట్లో 30 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు