కొత్తగూడెం ప్రగతి మైదాన్ : ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు మరోసారి తమ ఉనికిని చాటుకునే చర్యలో భాగంగా ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థిని దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా అర్నపూర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జోగా బర్సే నక్సలైట్ల చేతిలో హత్యకు గురయ్యాడు. సాయుధ మావోయిస్టులు గురువారం రాత్రి జోగ ఇంట్లోకి ప్రవేశించి కుటుంబసభ్యుల ఎదుటే గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది.
జోగా అంతకుముందు సీపీఐలో ఉన్నా, కొన్నేళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గురువారం అర్థరాత్రి పెద్ద సంఖ్యలో నక్సలైట్లు జోగ ఇంటి తలుపులు గొడ్డలితో పగలగొట్టి లోనికి చొరబడ్డారు. అనంతరం కుటుంబసభ్యుల ఎదుటే అతి దారుణంగా హత్య చేసినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఈ ఘాతుకానికి పాల్పడిన మావోయిస్టులు సమీప అటవీ మార్గం నుంచి పారిపోయినట్లు సమాచారం. దంతేవాడ, బీజాపూర్ జిల్లాల్లో గత 4 రోజుల్లో నక్సలైట్లు నలుగురిని గొంతు కోసి హత్య చేశారు. జోగ ఈ ప్రాంతంలో బలమైన గిరిజన నాయకుడని, గత 25 ఏళ్లుగా ఈ ప్రాంత రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడని స్థానికులు పేర్కొంటున్నారు.
2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఆర్నపూర్లో జోగా దంపతులు ఇద్దరూ సర్పంచ్‌లుగా పనిచేశారు. జోగా అంతకుముందు సీపీఐలో పనిచేశారు. కానీ 2018 – 2019 లో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రేంజ్ పరిధిలో నక్సలైట్లు మూడు రోజుల్లో ముగ్గురు గ్రామస్తులను హతమార్చారు. రెండు రోజుల క్రితం దంతెవాడ జిల్లాలో నక్సలైట్లు ఓ గ్రామస్తుడిని గొంతు కోసి హత్య చేశారు. పోలీసు ఇన్ఫార్మర్గా ఆరోపణలు చేసి హతమార్చారు. దంతేవాడ, బీజాపూర్ జిల్లాల్లో గత మూడు రోజుల్లో నక్సలైట్లు ముగ్గురు గ్రామస్తులను హతమార్చారు.