జనగామ చౌరస్తా, ఫిబ్రవరి7 : జనగామ జిల్లా కలెక్టరేట్లో(Jangaon Collectorate) కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వివిధ శాఖల ఉద్యోగస్తుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. సకాలంలో విధులకు హాజరు కాని 30 మంది ఉద్యోగులను గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు (Show cause notices)జారీ చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి సకాలంలో విధులకు హాజరు కావాలన్నారు. క్రమ శిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో కలెక్టరేట్ ఏవో మన్సూరి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Game Changer OTT | ఓటీటీలోకి వచ్చేసిన ‘గేమ్ ఛేంజర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.!
Rahul Gandhi | ఆ 39 లక్షల మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు..? : రాహుల్‌గాంధీ
Pregnant Woman | గర్భిణిపై లైంగిక దాడికి యత్నం.. ప్రతిఘటించడంతో కదులుతున్న రైలు నుంచి తోసేసిన కామాంధుడు