MLC Teenmar Mallanna | మల్కాజ్గిరి, ఫిబ్రవరి 7 : కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్ కథనం ప్రకారం.. ఫిబ్రవరి 4న వరంగల్‌లో జరిగిన బీసీ సభలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న.. అగ్రవర్ణాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పీసీసీ క్రమశిక్షణా కమిటీ.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు గురువారం జారీ చేసిన సంగతి తెలిసిందే. కుల గణన నివేదికపై మల్లన్న కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల గణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కుల గణన సర్వేలో బీసీల సంఖ్య తగ్గించినట్లుగా చూపించడంపై ఆయన సొంత ప్రభుత్వంపైనే తీవ్రంగా విమర్శించారు.
సర్వేను తప్పుపడుతూ తీవ్ర పదజాలంతోనే సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కుల గణన నివేదికను సైతం తగులబెట్టాలని పిలుపునిచ్చారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. బీసీ జనాభా తగ్గడంపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని తీవ్ర విమర్శల పాలు చేసింది. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
Anti Narcotics | మస్తాన్‌సాయి కేసులో రంగంలోకి దిగిన యాంటీ నార్కోటిక్స్ పోలీసులు..!
Hyderabad | హైదరాబాద్‌లో ఆర్టీఏ తనిఖీలు.. పది కార్పొరేట్ విద్యాసంస్థల బస్సులు సీజ్
Medigadda | ఎడారిగా మారిన మేడిగడ్డ.. పర్యాటకుల ఆవేదన